Tough to Believe in God, Say Aarushi Talwar's Parents

Talvar is a story of two parents who loved their child says family

Aarushi Talwar,Nupur Talwar,Rajesh Talwar,Talwars,Talwars case,Aarushi case,Talvar,Talwar film,Talwar interview,Talwar letters, Aarushi Talwar murder case,

Rajesh and Nupur Talwar were convicted of the twin murders of their teen daughter Aarushi and the family's domestic help Hemraj in 2013.

మా కూతురు హత్యపై మేమే పుస్తకం రాస్తున్నాం'

Posted: 10/01/2015 09:22 PM IST
Talvar is a story of two parents who loved their child says family

తమ కూతురు హత్యపై ఒక పుస్తకం రాయడం ప్రారంభించామని దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి, పనిమనిషి హేమ్ రాజ్ హత్య కేసులో ప్రధాన నిందితులు ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్ అన్నారు. ఈ పుస్తకం ద్వారా వాస్తవాలు వెల్లడించాలని అనుకుంటున్నామని, అయితే, ఇది రాస్తున్నప్పుడు చెప్పలేని బాధగా అనిపించి ప్రస్తుతానికి పక్కకు పెట్టామని చెప్పారు. ఆ పుస్తకం పూర్తయితే దానిని చదివిన తర్వాతైన నిజనిజాలు తెలుసుకుంటారని చెప్పారు. తమ కూతురు ఆరుషి హత్య కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న వారిని ఓ మీడియా లేఖల ద్వారా ఇంటర్వ్యూ చేసింది.

ఆరుషి హత్యపై పుస్తకం వచ్చింది, ఇప్పుడు ఓ సినిమా కూడా వస్తుంది, దీని ప్రభావం మీ కేసుపై ఉంటుందని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. తాము కూడా జైలులో ట్రైలర్ చూశామని, ఆ చిత్రం రెండు వైపుల ఆలోచించి తీసినట్లు ఉందనిపిస్తుందని, కానీ, దుర్భుద్దితో సీబీఐ చేసిన విచారణ జోలికి వెళ్లనట్లు కనిపిస్తుందని తెలిపారు. ఎవరు ఏం సినిమా తీసినా నిజాలు ఉన్నా లేకున్నా తాము మాత్రం వాస్తవాలతో కూడిన పుస్తకాన్ని రాస్తున్నామని, కొంత బాధతోపాటు ప్రస్తుతం కేసులు, పిటిషన్ల వ్యవహారంతో బిజీగా ఉన్నందున త్వరలో దానిని పూర్తి చేసి నిజనిజాలు వివరిస్తామని తెలిపారు. సీబీఐ పక్షపాతంతో తమపై దర్యాప్తు జరిపిందని తెలిపారు.

తమ బాధను ఎవరూ వినడం లేదని, తమ వైపే ఆలోచించకుండా దర్యాప్తు చేసి దోషులుగా సృష్టించారని చెప్పారు. తమ కూతురును కోల్పోయిన బాధలో ఉండగానే కేసులో ఇరికించి ముద్దాయిలుగా సృష్టించారని చెప్పారు. మీకు దేవుడి నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించగా.. కొన్ని సార్లు తప్ప ఎక్కువగా నమ్మలేమని, కానీ ఒక విషయం నిజం అని నిరూపించడానికి ముఖ్యంగా విశ్వాసం, ఓపిక అనేవి ఒక వ్యక్తికి ఉండాలని సాయిబాబా చెప్పిన మాటలు నమ్ముతామని అన్నారు. తాము అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశామని, అది ఇంకా విచారణ ప్రారంభం కావాల్సి ఉందని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aarushi Talwar  murder case  rajesh talwar  nupur talwar  

Other Articles