Leopard's Head Gets Stuck In Utensil While Drinking Water

Caught on camera leopard s head stuck in pot in rajasthan

Leopard,Leopard head stuck,Leopard head stuck in pitcher,Leopard head stuck in pot, Leopard's Head Gets Stuck In Utensil, Leopard's Head Gets Stuck In Rajasthan's Rajsamand, leopard rescued by forest officials

An unfortunate leopard ended up stuck in an aluminium utensil after it tried to drink water from it in Rajasthan's Rajsamand. The leopard was later rescued by forest officials.

ITEMVIDEOS: ఎరక్కపోయి వచ్చింది.. పిల్లిలా మారింది..

Posted: 10/01/2015 04:06 PM IST
Caught on camera leopard s head stuck in pot in rajasthan

అవసరం వస్తే పులి కూడా పిల్లిలా మారుతుంటే ఇదే కాబోలు. బాగా దాహం వేసిందనుకుంటా.. పరుగుపరుగు వచ్చిన ఓ చిరుత పులి అక్కడ కనిపించిన ఓ బిందెలో తలపెట్టి నీరు తాగేందుకు ప్రయత్నించింది. ఇరక్కుపోయింది. అదెలా అంటే.. చిరుతపులి తల ఓ బిందె బిగుసుకుపోయింది. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను అనే పాటను పాడుతూ.. ఇప్పుడేం చేయాలిరా భగవంతుడా అంటూ అంగలార్చింది. అయితే బిందెను తొలగించేందుకు పలువురు ప్రయత్నాలు చేసినా.. ఆ తరువాత జరిగే పరిణామాలను ఊహించుకుని నిమ్మకుండిపోయారు

నాకెవరైనా సాయం చేయండి బాబు.. నా తలకు బిగుసుకుపోయిన బిందెను తొలగించండి బాబు అంటూ దాని బాషలో అది ప్రాధేయపడింది. ఎటూ చూడలేక... చూట్టూ కనబడక.. పిల్లిలా మారి.. అదే చోటున సుమారు రెండు గంటల పాటు నానా తిప్పలు పడ్డింది. స్థానికుల సమాచారంలో ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు, పోలీసుల చొరవతో  బయటపడింది. రాజస్థాన్ లోని రాజ్సమండ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత ఘటనపై సమాచారమందుకున్న అధికారులు... వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని ఆపరేషన్ టైగర్‌ను మొదలుపెట్టారు.

చిరుతకి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి.. జాగ్రత్తగా బంధించారు. ఆ తర్వాత నిదానంగా బిందెలో చిక్కుకున్న పులి తలను బయటకు తీశారు. అయితే బిందె తీసేందుకు ముందు.. చిరుత చేసిన హల్‌చల్‌ అంతా ఇంతా కాదు. ముఖానికి బిందెతో  చిక్కకుండా... అధికారులందర్నీ పరుగులు పెట్టించింది. చివరకు మత్తు ఇంజెక్షన్ ప్రభావంతో చిరుత స్పృహ కోల్పోయిన తర్వాత అధికారులు తమ పని కానిచ్చారు. అనంతరం చిరుతను అధికారులు అక్కడ నుంచి తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : leopard  head  forest officers  resued  Rajasthan  Rajsamand  

Other Articles