Hindus find Selena’s 'Om' thigh tattoo 'out of line'

Selena gomez slips into bikini on miami beach shows om tattoo on thigh

Hindus find Selena’s 'Om' thigh tattoo 'out of line', American actor, singer Selena GomezSelena Gomez, hollywood star, Bikini, Miami Beach, 'Om' Tattoo, upper left thigh, irreverent, disrespectful, Rajan Zed, high religious significance

Hindus have described American actor/singer Selena Gomez’s reported new 'Om' tattoo on her upper left thigh as highly “irreverent and disrespectful”.

పాశ్య్చాత దురహంకార వైఖరి.. హాలీవుడ్ నటి శరీరంపై.. అక్కడ.. ఆ టాటూ..

Posted: 09/24/2015 10:26 PM IST
Selena gomez slips into bikini on miami beach shows om tattoo on thigh

ప్రపంచంలో వింత పోకడలకు పోతూ.. ఇతరు మనోభావాలను దెబ్బతీయడంలో పాశ్చ్యత దేశానికి చెందిన వాళ్లకు కొదవలేదు. కొంత పేరు రాగానే నేనే నెంబర్ వన్ అంటూ విర్రవీగే.. అహంభావులలో ఆడ, మగ అన్న తేడా కూడా లేకుండా పోతోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ.. హాలీవుడ్ నటి, పాప్ స్టార్ సెలీనా గోమోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల అమెరికాలోని మియామీ బీచ్ లో బికినీలో జలకాలాడుతూ సాదారణ స్తాయిలో వుండే బికినీ కన్నా అంతకు మించి కట్ స్థాయిలో వున్న బికినీ ధరించి సందడి చేసింది.

అర్థనగ్నంగా, పూర్తి నగ్నంగా నటించే ఈ తారలకు ఇది పెద్ద విషయమేమి కాదు. అయితే ఈ సందర్భంగా ఆమె తన తొడపై వేయించుకున్న టాటూ కెమెరాకు చిక్కింది. సినిమా తారలు టాటూలు వేయించుకోవడం మామూలే. అయితే ఈ టాటూ భారత దేశానికి చెందినది కావడం, అందులోనూ హిందువుల చిహ్నం ‘ఓం' టాటూ కావడంతో హాట్ టాపిక్ అయింది. ప్లెయిన్ బ్లాక్ స్విమ్ సూట్ ధరించి సెక్సీ లుక్ తో దర్శనమిచ్చిన సెలీనా టోన్డ్ బాడీ చూసి అభిమానులు ముగ్దులైపోతున్నారు. ముఖ్యంగా ఆమె ధరించిన బికినీ స్కిన్ టైట్ గా ఉంటూ ఆమె అందాలను మరింత ఇనుమడింపచేసే విధంగా ఉండటం గమనార్హం. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించాయి.

ఈ టాటూ ప్రదర్శించడానికే అన్నట్లు ఆమె ధరించిన బికినీ మరింత కట్ షేపుతో ఉంది. సెలెనా గోమెజ్ ‘ఓం' టాటూ వేయించుకోవడాన్ని బట్టి ఆమె హిందూయిజాన్ని ఫాలో అవుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన మాజీ బాయ్ ఫ్రెండు జస్టిన్ బీబర్ తో కలిసి ఉన్నపుడు క్యాథలిక్ చర్చిల్లో కనిపించే అమ్ముడు ఇపుడు అతనితో విడిపోయాక రూటు మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సెలీనా గోమెజ్ వీలైనంత మేరకు పబ్లిసిటీ పెంచుకునేందుకు, ఇంటర్నేషనల్ సర్కిల్‌లో తన పేరు మారుమ్రోగేలా తన అందాలు ఆరబోస్తూ తరచూ హడావుడి చేస్తోంది. ఇటీవల తన ఆల్బం విడుదల సందర్భంగా అమ్మడు తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో న్యూడ్ ఫోటో పోస్టు చేసింది.

అయితే దీనిపై హిందువులు పెదవి విరుస్తున్నారు. సర్వశక్తికి మూలాధారమైన ఓంకార నాధాన్ని అమె తన తొడలపై వేయించుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని హిందు నెట్ జనులు మండిపడుతున్నారు. ప్రముఖ హిందూ ధార్మిక ప్రచారకర్త రాజన్ జెడ్ మాట్లాడుతూ.. హిందువులు తమ పూజలన్నింటినీ ఓంకారంతోనే ప్రారంభించి.. ఓంకారంతోనే ముగిస్తారని.. అలాంటి అత్యంత పవిత్రమైన హిందువుల చిహ్నాన్ని అభ్యంతకర ప్రదేశాలలో వేయించుకుని సెలినీ తప్పుచేసిందని అన్నారు. ప్రజల ప్రగాఢ మతవిశ్వాసాలతో కూడుకున్న ఈ అంశాన్ని ముందుగా అమె అర్థం చేసుకోవాలని సూచించారు. ఇతర మతాలకు విశ్వాసాలకు గౌరవం, మర్యాద ఇవ్వడం తెలుసుకోవాలని మండిపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Selena Gomez  hollywood star  Bikini  Miami Beach  'Om' Tattoo  

Other Articles