We can't follow the West blindly, night outs by girls against Indian culture

Sharma clarifies kalam remark but bjp does not reveal stance

Mahesh Sharma, men in india, Minister for culture, regressive society, ThatsJustWrong, Women in India, culture minister, Girls nighout ban, Girls nightout, India, Union culture minister Mahesh Sharma, RSS, BJP, NDA government, Controversial statements

Union Culture Minister Mahesh Sharma has fired a salvo, saying night out by girls is against Indian culture. Speaking exclusively to CNN-IBN, the minister said that a girl wanting a night out might be all right elsewhere but not in India.

మహేష్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యాలపై మండిపడుతున్న మహిళా సంఘాలు

Posted: 09/20/2015 05:27 PM IST
Sharma clarifies kalam remark but bjp does not reveal stance

అమ్మాయిలు అర్థరాత్రి దాటాక ఒంటరిగా బయటకు వెళ్లడం, మేలుకుని ఉండడం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధమని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్‌ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నెట్ జనులతో పాటుగా మహిళా సంఘాలూ కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. అనాధిగా వస్తున్న భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పేరుతో.. ఇంకా ఎన్నాళ్లు మహిళలను బంధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను పరిశీలిస్తే.. సతీసహగమనం తరహా మూడాచారాలను ప్రేరేపించేలా వున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇది 2015 అని కనీసం ఇప్పుడైనా మహిళలను వాళ్లు ఏ రాత్రిళ్లు ఏం చేసుకోవాలో వారే నిర్ణయించుకునేలా మంత్రులు వ్యాఖ్యలు చేయాలని కానీ.. వారి మరింత ఇబ్బందులు పాలు చేసేలా వ్యాఖ్యలు చేయరాదని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి.

ఒక జాతీయ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూ లో కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలు రాత్రుళ్లు స్వేచ్ఛగా బయట సంచరించడం విదేశాలలో అయితే చెల్లుబాటు అవుతుందనీ, భారతదేశంలో మాత్రం కాదనీ ఆయన అన్నారు. అయితే ఈ ప్రకటన వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చుకున్నారు. ‘‘నా కుమార్తె కూడా డాక్టరు. ఆమె కూడా రాత్రుళ్లు సినిమాలకు వెళుతుంది. భారతీయ, ఐరోపా సంస్కృతులు భిన్నమైనవని చెప్పానంతే’’ అని వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా మంత్రివర్యులు వివరణ ఇచ్చారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్.. మహ్మదీయుడు అయినప్పటికీ.. ఆయన సంపూర్ణ దేశభక్తి ఇమిడివున్న వ్యక్తని వివరణ ఇచ్చుకోవడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ స్పందిస్తూ.. అబ్దుల్ కలామ్ పూర్తిగా ఫ్యాంటు వేసుకున్న దేశభక్తిపరుడని, అయితే సగం ప్యాంటు (నెక్కరు) వేసుకుని ఆర్ ఎస్ ఎస్ కార్యకలాపాలలో పాలుపంచుకునే నేతలు మాత్రమే దేశభక్తిపరులన్నట్లుగా వ్యవహరించరాదని అన్నారు. ఇక ఈ విషయం నుంచి కేంద్రంలోని మోడీ సారథ్యంలో గల ఎన్డీఏ ప్రభ్వుతం మాత్రం దూరం జరిగింది. మంత్రివ్యాఖ్యలపై ఎలాంటి ప్రతిస్పందన ఇప్పటివరకు వెలువరించలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Sharma  culture minister  Girls nighout ban  Girls nightout  India  

Other Articles