Roja | Gaali Muddukrishnama Naidu | YSRCP, TDP

Ysrcp leader roja contracersial coments on gaali muddukrishnama naidu

Roja, Gaali, Gaali Muddukrishnama Naidu, YSRCP, TDP

YSRCP leader Roja contracersial coments on Gaali Muddukrishnama naidu. Roja gave strong warning to Gaali Muddukrishnama Naidu.

ఆయన తాట తీస్తానంటున్న రోజా

Posted: 08/20/2015 03:01 PM IST
Ysrcp leader roja contracersial coments on gaali muddukrishnama naidu

వైఎస్ఆర్ సీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి తన మాటల తూటాలు పేల్చింది. నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా టిడిపి నేతల మీద, ఏపి మంత్రుల మీద ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం న్యూస్ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కావడం మామూలే. ఇక తాజాగా మరోసారి అమ్మగారు వార్తల్లోకెక్కారు. టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తాట తీస్తానంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. వైసీపీ పార్టీ నేత రోజాకు సీనియర్ల కాస్త చెప్పాలని .. ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే కుదరదు అని ముద్దు కృష్ణమ గతంలో హెచ్చరించారు. దానికి కౌంటర్ గా తనదైన స్టైల్ లో రోజా వ్యాఖ్యలు చేసింది. ర్యాగింగ్ భూతం మీద రోజా గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడు మీద , ఏపి ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అయితే రోజా చేసిన వ్యాఖ్యల మీద గాలిముద్దుకృష్ణమ నాయుడు స్పందించారు.

గతంలో కూడా రోజా ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలోనే తనను రేప్ చేసే దమ్ముందా మీకు అంటూ టిడిపి నేతల మీద సవాల్ విసిరారు. అప్పుడు రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి. రోజా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో తెలుగు రాష్ట్రాల్లో స్పీడ్ గా పాపులారిటీ సంపాదించారు. టిడిపిలో ఉన్నా... తర్వాత కాంగ్రెస్ లో ఆ తర్వాత వైసీపీలో ఉన్నా కానీ రోజా మాత్రం తన మాటల తూటాల ధాటిని తగ్గించడం లేదు. వైసీపీ పార్టీలో జగన్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీడియా రోజా మాటలకు కూడా అంతే కవరేజ్ ఇస్తోంది. ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం అమ్మగారికి అలవాటైపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Gaali  Gaali Muddukrishnama Naidu  YSRCP  TDP  

Other Articles