Women | Harassment, AP, Telangana, ladies, Violence

There is no protection in telugu states

Women, Harassment, AP, Telangana, ladies, Violence

There is no protection in telugu states. The crime rate in telugu states about women harrasment getting new numbers.

తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్లకు భద్రత లేదు

Posted: 08/20/2015 03:06 PM IST
There is no protection in telugu states

మహిళలపై జరుగుతున్న నేరాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. మహిళలను అవమానించడం, వేధించడం కేసుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉండగా… తెలంగాణ రాష్ట్రం కాస్త అటు ఇటుగా ఏపీతో పోటీపడుతోంది. ఇక మోసం, సైబర్ నేరాల్లోనూ నువ్వానేనా అన్నట్టుగా ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం ..  మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడం, వర్క్ ఏరియాలో వారిని వేదించడం వంటి నేరాల్లో ఏపీ, తెలంగాణ  ఈక్వల్ స్టేజ్ లో ఉన్నాయి. మహిళల పై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే ముందువరుసలో ఉన్నాయి.

ఇక మహిళల పై జరుగుతున్న అత్యచారాల్లో 5వేల 76 కేసులతో మధ్యప్రదేశ్ టాప్ ప్లేస్ లో ఉంది. 3 వేల 759 ఘటనలతో రాజస్థాన్ సెంకండ్ ప్లేస్ లో నిలిచింది.  మిగాతా నేరాలను పరిశీలిస్తే 5 వేల 150 హత్యలతో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా… 3 వేల 403 హత్యలతో బీహార్ రెండో ప్లేస్ కొట్టేసింది. 1308 హత్యలతో తెలంగాణ 12 స్థానంలోనూ….1175 హత్యలతో ఏపీ 13 వ ప్లేస్ లో నిలిచాయి. వరకట్న వేధింపుల హత్యల్లో  ఉత్తరప్రదేశ్ 2 వేల 469 కేసులతో ముందువరుసలో ఉండగా…1379 హత్యలతో బిహార్ రెండోప్లేస్ లో నిలిచింది. సైబర్ వేదింపుల్లోనూ రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. 504 కేసులతో ఏపీ మూడోప్లేస్ లో… 426 కేసులతో తెలంగాణ నాల్గొస్థానంలో కొనసాగుతున్నాయి. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామంటున్న  తెలుగు రాష్ట్రాలు… వారిని అవమానించడంలోనూ ముందుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Women  Harassment  AP  Telangana  ladies  Violence  

Other Articles