UAE allots land to build first temple in Abu Dhabi as Modi visits the Gulf state

Narendra modi offers 1 trillion investment opportunity to uae

Modi UAE visit, PM Modi UAE visit, Abu Dhabi temple UAE, Naredra modi, UAE, Abu Dhabi, 1 Trillion USD investments, abudhabi indians

Prime Minister Narendra Modi, began his two-day visit to the strategic Gulf nation today and the UAE declared to allot land for building a temple in Abu Dhabi.

మోడీ రాకతో ఆలయానికి స్థలం.. ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆహ్వానం

Posted: 08/17/2015 04:24 PM IST
Narendra modi offers 1 trillion investment opportunity to uae

సుదీర్ఘ కాలం తరువాత సుమారుగా 34 ఏళ్ల తరువాత భారత ప్రధాని నరేంద్రమోడీ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో బిజీ బిజీగా గడపనున్నారు. అ దేశ ప్రముఖ నగరం అబుదాబిలోని ప్రఖ్యాత షేక్ జయేద్ మసీద్ ను సందర్శించి.. మతసామరస్యాన్ని చాటారు. మసీదు లోపల కలియతిరిగిన ప్రధాని ఆ పవిత్ర ప్రార్థనామందిరం ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. భారత్ సహా, ప్రపంచంలోని చాలా దేశాల నుంచి తీసుకువచ్చిన మార్బుల్స్ తో ఈ మసీద్ నిర్మించారు. 2007 నుంచి మసీదులోకి సందర్శకులను అనుమతిస్తున్నారు. అయితే ఇలా మసీదులో అడుగుపెట్టిన మోడీ.. అలా తొలిసారిగా అబుదాబిలో హైందవ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని కూడా కేటాయిచేలా చర్యలు తీసుకున్నారు. దుబాయ్ లో రెండు ఆలయాలు వున్నా అబుదాబిలో ఆలయం లేదు. మోడీ రాక సందర్భంగా ఆలయానికి స్థలాన్ని కేటాయించింది అక్కడి ప్రభుత్వం.

 ఆ తరువాత ఆబుధాబి శివారులోని కార్మిక నివాసాన్ని సందర్శించి.. బారత కార్మికుల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. క్యాంపులోని భారతీయ కార్మికులను ప్రత్యేకంగా ఇండోర్‌ స్టేడియంలో కలుసుకున్న మోదీ... హిందీతో పాటు అనువాదకుల సహాయంతో మలయాళం, తెలుగు, తమిళ భాషలు మాట్లాడే కార్మికులతో నవ్వుతూ మాట్లాడారు. కరీంనగర్‌ జిల్లా కథ్లపూర్‌ మండలం భూషణ్‌రావు పేట గ్రామానికి చెందిన ముస్కు రాము అనే ప్రవాసీ యువకుని భుజంపై చేయి వేసి ప్రధాని అనేక కుశల ప్రశ్నలు అడిగారు. అనంతరం మరో కార్మికునితో మాట్లాడుతుండగా... తెలంగాణ కార్మికుడు ప్రధానితో మాట్లాడబోయాడు. దీంతో, ‘‘తెలంగాణా.. ఉండూ.. ఉండూ...’’ అని ప్రధాని స్పందించారు.

మస్టర్‌ నగరంలో గల సౌరవిద్యుత్‌ కార్ల సంస్థను పరిశీలించారు. ప్లాంట్‌లో కార్ల తయారీ విధానాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే యూఏఈ రాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయాద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అనంతరం నిర్వహించిన పెట్టుబడిదారుల సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. భారత్ దేశంలో పెట్టుబడులకు ముందుకు రావాలని వారిని అహ్వానించారు. ప్రస్తుతం దేశంలో ట్రిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులకు అవకాశముందని చెప్పారు. పెట్టుబడిదారులు ముందుకువస్తే వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సమకూర్చేందుకు సిద్దంగా వుందని అన్నారు. గత 34 ఏళ్లగా తెగిన వ్యాపారసంబంధాలను మళ్లీ బలోపేతం చేసుకునేందుకు పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రాస్టక్చర్, ఇంధనం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  UAE  Abu Dabhi  1 Trillion USD investments  

Other Articles