Engineer, son arrested with Rs 24 cr cash, gold, diamonds

Rs 20cr found under tiles of howrah civic official s home

West Bengal,Diamonds,Howrah , Engineer, son arrested with Rs 24 cr cash, gold, diamonds,news, India news, sub-assistant engineer, Mayor, Howrah Municipal Corporation, Corruption, Bally

A state government engineer and his son were arrested by Anti Corruption Bureau (ACB) of West Bengal Police after cash worth over Rs 24 crore and gold ornaments, diamonds worth lakhs were seized from his residence at Bally in Howrah district, an official said today.

చేపల వేటకని వెళ్తే.. ఏసీబి అధికారులకు సొరచేప దొరికింది..

Posted: 08/15/2015 08:44 PM IST
Rs 20cr found under tiles of howrah civic official s home

పశ్చిమబెంగాల్ అవినీతి నిరోధక అధికారులు చేపట వేటకని బయలుదేరి వెళ్లారు. అయితే ఎంత లెక్కించినా.. బయటపడుతున్న డబ్బును చూసి తమకు అవినీతి చేప దొరుకుతుందని వస్తే.. ఏకంగా సొరచేప దొరికిందని వివ్వెరపోయారు. ఇంతకీ అ అధికారి ఎవరో తెలుసా..? ప్రభుత్వ ఇంజినీర్. ఎక్కడ అంటారా.. పశ్చిమ బెంగాల్ లో. ఇంజనీర్ ఇంట్లో సోదాలు చేసిన ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు.. భారీ అవినీతి సంపాదనను స్వాధీనం చేసుకున్నారు. ఇంజినీర్తో పాటు ఆయన కొడుకును అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. హౌరా జిల్లాలోని బాలీలో స్థానిక బిల్డర్ ఫిర్యాదు మేరకు మున్సిపాలిటీ సబ్ అసిస్టెంట్ ఇంజినీర్ ప్రణబ్ అధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆయన ఇంట్లో 24 కోట్ల రూపాయలకు పైగా నగదు, వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. బెడ్రూమ్, బాత్రూమ్, ఇతర ప్రాంతాల్లో దాచిన 100, 500, 1000 రూపాయల నోట్ల కట్లను వెలికితీశారు. ఇంట్లో 6 గదుల్లో టైల్స్ కింద ఉంచిన నగదును గుర్తించారు. వీటిని చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. వీటితో పాటు టర్మ్, ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్లు, ఇతర ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంజినీర్తో పాటు ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sub-assistant engineer  Mayor  Howrah Municipal Corporation  Corruption  Bally  

Other Articles