AP | Special status | Rammohan Naidu

Ap mp rammohan naidu question the central govt to provide special status for ap

AP, Special status, Central Govt on special status, Rammohan Naidu, Srikakulam MP, Parlaiment

AP Mp Rammohan naidu question the central govt to provide special status for ap. He said that dont compare the state of ap with any other states.

ITEMVIDEOS: ఏపికి ప్రత్యేక హోదా పై రామ్మోహన్ నాయుడు దుమ్ము రేపాడు

Posted: 08/01/2015 04:31 PM IST
Ap mp rammohan naidu question the central govt to provide special status for ap

ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు... మిగతా రాష్ట్రాలు అస్సలు ఒప్పుకోవడం లేదు.. ఏపికి కావాలంటే అదనంగా నిధులు ఇస్తాం కానీ ప్రత్యేక హోదా ఇవ్వడం దాదాపుగా కుదరదు. ఇవి కేంద్ర ప్రభుత్వం వినిపిస్తున్న భిన్న ప్రకటనలు. రోజుకో ప్రకటనతో ప్రత్యేక హోదా మీద ఎన్నో ఆశలున్న ఏపికి తీవ్ర నిరాశను మిగులుస్తూ కేంద్రం ప్రకటనలు చేస్తూనే ఉంది. అయితే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యపార్టీగా ఉంది. అయినా కానీ ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడగలేని పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని తెలుగు నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపినా కానీ చంద్రబాబు నాయుడు ఏమీ అనని పరిస్థితి. అయితే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని ఓ యువ ఎంపీ పార్లమెంట్ లో తన గొంతును గట్టిగా వినిపించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు చంద్రబాబు కంటే చాలా బెటర్ గా పార్లమెంట్ లో ఏపికి ప్రత్యేక హోదా గురించి నిలదీశారు.

రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్‌తో సతమతం కావాల్సి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పడేందుకు విభజన సమయంలో హామీ ఇచ్చిన ప్రత్యేక కేటగిరీ హోదాను వెంటనే ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు కింజారపు రామ్మోహన్‌ నాయుడు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి రావడంతో దేశంలో ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల విధానం రద్దయిందని కేంద్ర ప్రణాళికా శాఖ సహాయ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ తర్వాత రామ్మోహన్‌ నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తారు. సభలో ప్రణాళికా శాఖ మంత్రి సమాధానాన్ని ప్రస్తావించిన శ్రీకాకుళం ఎంపీ ప్రత్యేక హోదాను కోరుతున్న ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ను పోల్చడం సరైంది కాదని చెప్పారు.

రాష్ట్ర విభజనకు ముందు తమ రాష్ట్రానికి లోటు బడ్జెట్‌ లేదని, యూపీఏ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లనే ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని రామ్మోహన్‌ నాయుడు వివరించారు. 14వ ఆర్థిక సంఘం నివేదికతో రాష్ట్రాలకు లభించే కేంద్ర పన్నుల ఆదాయం పెరిగినా మరో ఐదేళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ లోటు బడ్జెట్‌ రాష్ట్రంగానే మిగులుతుందని ఆ సంఘమే తెలిపిందని రామ్మోహన్‌ నాయుడు గుర్తుచేశారు. పొరుగున ఉన్న తెలంగాణ, కర్నాటక, ఒడిశా, తమిళనాడులు మాత్రం ఐదేళ్ల తర్వాత రూ.30 నుండి 40వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో విలసిల్లుతాయంటూ ఇతర రాష్ట్రాలతో పోటీ పడేందుకు ఏపీకి కూడా సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను అర్థం చేసుకొని తక్షణమే ప్రత్యేక కేటగిరీ హాదాను మంజూరు చేయాలన్న ఆయన 90శాతం నిధులు గ్రాంట్‌గా పదిశాతం మాత్రమే రుణంగా లభించే ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవడం అత్యంత కష్టసాధ్యమన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన మూడు అతిపెద్ద పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఎంపీ ఆవేదనను వ్యక్తం చేశారు. కేంద్రం నుండి భారీగా గ్రాంట్‌ రూపంలో నిధులు అందితే రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టవచ్చునన్న ఆయన ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చేంతవరకైనా తక్షణం 90శాతానికి బదులుగా 80శాతమో, 70శాతమో గ్రాంట్‌గా అందించేలా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీనైనా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హాదా కల్పించడంతో పాటు విభ జన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ తు.చ.తప్పకుండా అమలు చేయాలని కోరారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Special status  Central Govt on special status  Rammohan Naidu  Srikakulam MP  Parlaiment  

Other Articles