Gold | Gold Rate | Gold Rates in Hyderabad, Gold rates in market, Stock market

Gold rates may drop to 23 thousand soon

Gold , Gold Rate, Gold Rates in Hyderabad, Gold rates in market, Stock market

Gold Rates may drop to 23 thousand soon. In India may gold rate drop to 23 thousand rupees soon. By the international market, By stock market the gold rate may drop to 23k.

బంగారం ధర 23వేలకు దిగిరావచ్చు

Posted: 07/29/2015 04:25 PM IST
Gold rates may drop to 23 thousand soon

ప్రపంచ మార్కెట్లో రోజురోజుకు బంగారం ధర తగ్గుతూ వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర నింగి వదిలి నేలకు వస్తోంది. ప్రస్తుతం బంగారానికి డిమాండ్ తగ్గిపోతోంది. మెటల్స్ షేర్లు నష్టాల్లో కొనసాగే అవకాశాలున్నాయని సూచనలు రావటంతో అమ్మకాల జోరు పెరిగింది. అమెరికా మార్కెట్స్‌లో ఔన్స్‌ బంగారం ధర మరింత తగ్గనుంది. ఇవాళ ఔన్స్ బంగారం1097 డాలర్లుగా నమోదైంది. రెండు వారాలుగా బంగారం ధరలు బాగా తగ్గాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపారులు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో విదేశాల నుంచి పసిడి దిగుమతులు భారీగా  పెరగడంతో... నిల్వలు ఎక్కువై డిమాండ్ తగ్గిపోయింది. గ్రీస్ సంక్షోభానికి తోడు అమెరికా, ఇరాన్‌ల మధ్య అణు చర్చలు సఫలం అయ్యే అవకాశాలు ఉండటంతో చమురు ధర కూడా తగ్గుతూ వస్తోంది. దీంతో బంగారం, అయిల్‌ షేర్లలో భారీ పతనం కనిపించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  అదీగాక, డాలర్‌తో రూపాయి మారక విలువ స్వల్పంగా క్షీణించటం వల్ల బంగారం ధరలో తేడా ఉంది. లేకపోతే ఈ పాటికి 23 వేలు బంగారం ధర చేరేది.

మేలిమి బంగారం పది గ్రాములు 23వేలకే వస్తుందని బులియన్‌ మార్కెట్ అంచనా వేస్తోంది. నమ్మశక్యంగా లేకపోయినా అది ఆగస్టు చివరిలోపు జరిగేలా కనిపిస్తోంది. త్వరలోనే గోల్డ్ రేట్స్ భారీగా తగ్గనున్నాయి. ఇందుకు దేశీయ పరిస్థితుల కంటే అంతర్జాతీయ అంశాలే ఎక్కువ ప్రభావం చూపించనున్నాయి. 2006 తర్వాత బంగారంలో ఇంత పతనం ఎప్పుడూ చూడలేదని బులియన్‌ వర్గాలు అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కరెన్సీల్లాగే వెంటనే ప్రభావితమవుతుంది బులియన్ మార్కెట్‌. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువ ఎలా ఉన్నా గోల్డ్‌ రేట్లు మాత్రం దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తలతో డాలర్ విలువ పెరుగుతోంది. దీంతో, బంగారంపై పెట్టుబడులన్నీ ప్రభుత్వ బాండ్లవైపు మళ్లుతాయి. ఫలితంగా పసిడికి డిమాండ్ పడిపోయి, ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇదిగాక, చైనాలో స్టాక్‌మార్కెట్‌ సంక్షోభమూ.. మరో కారణమంటున్నారు. అయితే మన దగ్గర బంగారంపై కేంద్రప్రభుత్వం నియంత్రణ విధిచటం, భారీగా పన్నులు ఉండటంతో.. అంతర్జాతీయంగా ధర తగ్గినా అంత వేగంగా వినియోగదారులకు లబ్ది చేకూరటం లేదు. బంగారం ధరలే కాదు.. వెండి ధర కూడా కొద్దికొద్దిగా తగ్గుతోంది. అన్నీ సరిగ్గా అనుకూలిస్తే బంగారం ధర 23 వేల దిగువకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  Gold Rate  Gold Rates in Hyderabad  Gold rates in market  Stock market  

Other Articles