TSPSC | Telangana | Jobs | Groups | Group 1

Telangana govt clear the posts in the groups

TSPSC, Telangana, Jobs, Groups, Group 1, Group 2, Telangana Jobs, Telangana Govt Jobs

Telangana govt clear the posts in the groups. Depty. collector, RDO, MPDO are In Group 1 and Muncipal commissionr, Depty Thahasildar and some more posts in group 2

గ్రూప్ 3లో 17 రకాల పోస్టులు.. ఖరారు చేసిన తెలంగాణ సర్కార్

Posted: 07/29/2015 04:48 PM IST
Telangana govt clear the posts in the groups

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 వేల ఉద్యోగాల భర్తీకి విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూపుల వారీగా ప్రభుత్వం పోస్టులను విభజించింది. గ్రూప్-1 కింద డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, ఎంపీడీవో సహా 20 రకాల పోస్టులను చేర్చారు. గ్రూప్ -2 కింద పురపాలక కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ సహా 12 రకాల పోస్టులను చేర్చారు. గ్రూప్ -3 కింద 17 రకాల పోస్టులను చేర్చారు. గ్రూప్-1లో ఆరోపేపర్‌గా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం చేర్చారు. గ్రూప్-1కు 1000 మార్కులు, గ్రూప్-2కు 675 మార్కులు కేటాయించడం జరిగింది.

గతంలో గ్రూప్-1లో ఐదు పేపర్లు, గ్రూప్-2లో మూడు పేపర్లుండేవి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గ్రూప్-1లో ఆరో పేపర్, గ్రూప్-2లో నాలుగో పేపర్‌ను చేర్చింది. ఆరు(గ్రూప్-1), నాలుగో పేపర్‌(గ్రూప్-2)లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం చేర్చడం జరిగింది. గ్రూప్-1కు మొత్తం 1000 మార్కులు(గతంలో ఇంటర్వ్యూతో కలిపి 825 మార్కులు) కేటాయించగా, గ్రూప్-2కు 675 మార్కులు(గతంలో 450 మార్కులు) కేటాయించడం జరిగింది. గ్రూప్ -2 ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు. గ్రూప్-2లో ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున కేటాయించారు.

నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానిస్టేబుల్ దగ్గరి నుండి గ్రూప్ వన్ వరకు అన్ని పోస్టలు భర్తీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే తాజాగా టిపిఎస్సీ నుండి వివిధ శాఖలకు లేఖలు అందినట్లు సమాచారం. అందులో భాగంగా మరో వారం లేదంటే పది రోజుల్లో అన్ని శాఖల నుండి వివరాలు అందుతాయని.. తర్వాత ప్రభుత్వం అనుమతితో నోటిఫికేషన్ల జారికి సిద్దంగా ఉన్నమని టిపిఎస్సీ వర్గాలు తెలిపాయి. అయితే మొదటి విడుతగా విడుదల చెయ్యనున్న 15 వేల పోస్టుల భర్తీలో ఏయే పోస్టుల భర్తీ.. ఎలా జరుగుతుంది అన్న దానిపై భిన్నవాదనలు ఉన్నాయి.

నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నోటిఫికేషన్లు జారీ చెయ్యాలనే ఆలోచనలో ఉంది. అందుకే కేసీఆర్ 45 రోజుల గడువు విధిస్తూ నోటిఫికేషన్లను విడుదల చెయ్యాలని.. వాటిని వేగంగా భర్తీ చెయ్యాలని ఆదేశించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదు. ఎందుకంటే ఒక్క పోలీస్ కానిస్టేబుల్ తో పాటు అగ్నిమాపక శాఖకు సంబందిచిన పోస్టులకు మాత్రం ఎలాంటి అడ్డంకి లేదు మిగిలిన వాటి వ్యవహారం మాత్రం మరోలా ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 లలో కొత్తగా తెలంగాణ చరిత్రకు సంబందించిన అంశాలు అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబందించిన సెలబస్ ఖరారు కాలేదు. కోచింగ్ సెంటర్లలో తలో సెలబస్ ను బోధిస్తూ విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : TSPSC  Telangana  Jobs  Groups  Group 1  Group 2  Telangana Jobs  Telangana Govt Jobs  

Other Articles