Osmania Hospital | Hospital Shiffting | KCR | Telangana, Osmania

Osmania hospital shiffting will start from today

Osmania Hospital, Hospital Shiffting, KCR, Telangana, Osmania

Osmania Hospital shiffting will start from today. Telangana cm KCR order to shift the hospital and construct new builing.

నేటి నుండి ఉస్మానియా ఆసుపత్రి తరలింపు

Posted: 07/29/2015 08:25 AM IST
Osmania hospital shiffting will start from today

నేటి నుంచి ఉస్మానియా ఆస్ప్త్రి తరలింపు కానుంది. అందులో భాగంగా పరికరాల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి రోజు ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన పరికరాలను కింగ్‌కోఠి ఆస్పత్రిలో సర్దుబాటు చేయనున్నారు. నిన్న ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, అన్ని విభాగాల హెచ్‌ఒడిలు, నర్సింగ్‌ సిబ్బందితో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, డీఎంఈ ఎం.రమణి సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం వైద్యులు, సిబ్బందిని పలు చోట్లకు మార్చడం వల్ల వైద్య చికిత్సలకు ఇబ్బంది కలగనున్న నేపథ్యంలో కింగ్‌కోఠి, సూల్తాన్‌బజార్‌ ఆస్పత్రుల్లోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

Also Read:  చంద్రబాబు... అసెంబ్లీ మీ తాత కట్టిందా..?

శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా భవనంలో మొత్తం 857 పడకలు ఉన్నాయి. వీటిలో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మెడికల్‌ గ్యాస్ట్రో ఎంటమాలజీ, సర్జరీ గ్యాస్ట్రో ఎంటమాలజీ, జైలు వార్డు, ఆరోగ్య శ్రీకి 580 పడకలు ఉన్నాయి. ఈ నాలుగు విభాగాలను సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రికి తరలిస్తారు. అదేవిధంగా ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన 120 పడకలను కింగ్‌కోఠి ఆస్పత్రిలో సర్దుబాటు చేయనున్నారు. మిగిలిన 157 పడకలను ఉస్మానియా కొత్తభవనంలోనే సర్దుబాటు చేస్తారు. కుదరక పోతే అందులోని కొన్ని పడకలను నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి తరలిస్తారు. కాగా పరికరాలను సాధ్యమైంత తొందరగా తరలించాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడతాయని అధికార వర్గాలు తెలియజేశాయి. కాగా ఉస్మానియా ఖులీకుతుబ్‌షా భవనంలోనే ఎమర్జెన్సీ, ఓపీ సేవలు కొనసాగనున్నాయి. ఇక్కడి వచ్చే రోగులను ఆయా ఆస్పత్రులకు తరలించేందుకు ప్రభుత్వం రెండు మినీ బస్సులు, పది అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న నర్సింగ్‌ కళాశాలను సికింద్రాబాద్‌ బోయిగూడలో ఉన్న కళాశాలకు తరలించనున్నారు.

Also Read:  ఒక్కో యూనివర్సిటికి ఒక్కో ఛాన్స్ లర్.. తెలంగాణ సర్కార్ సమాలోచనలు

ఉస్మానియా ఆస్పత్రి తరలింపుకు వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉస్మానియా పాత భవనం శిథిలావస్థలో ఉన్న నేపథ్యంలో కేసీఆర్.. వెంటనే పాత భవనాన్ని కూల్చి అదే స్థానంలో  కొత్త భవంతిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఉస్మానియా తరలింపు మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉస్మానియా ఆస్పత్రిని తరలించడానికి వీలులేదని.. కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉస్మానియా పూర్వ విద్యార్థులు, మాజీ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క పలు విద్యార్థి సంఘాలు కూడా దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Osmania Hospital  Hospital Shiffting  KCR  Telangana  Osmania  

Other Articles