Section 8 | Hydeabad | Telangana | AP, section 8 in Hyderabad

Central govt once more told that no guidelines on implementation of section 8 in hydearabad

Section 8, Hydeabad, Telangana, AP, section 8 in Hyderabad

Central Govt once more told that no guidelines on implementation of section 8 in Hydearabad. TDP Leader Avanthi Srinivas asked a qestion about the section 8 guidelines in the parliament.

సెక్షన్ 8 అమలు చెయ్యాలని గైడ్ లైన్స్ ఇవ్వాలని లేదు

Posted: 07/29/2015 07:52 AM IST
Central govt once more told that no guidelines on implementation of section 8 in hydearabad

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల మధ్య దోబూచులాడుతోంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. ఏపి ప్రభుత్వం సెక్షన్ 8 అమలు చెయ్యాలని.. డిమాండ్ చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం దానికి వ్యతిరేకిస్తోంది. మరి ఏదోటి తేల్చాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎటూ తేల్చడం లేదు. తాజాగా మరోసారి డైలమాలో పడేసేటట్లు సెక్షన్‌ 8ని అమలు చేయాలంటూ గైడ్‌ లైన్స్‌ ఇవ్వాలన్న నిబంధన చట్టంలో లేదని కేంద్రం తరఫున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్‌ చౌధరి తెలిపారు. దాంతో ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సభ్యుడు అవంతి శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Also Read :  సెక్షన్ 8 పై కేసిఆర్ కు షాక్.. పార్లమెంట్ సాక్షిగా వెల్లడి

ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని సెక్షన్లను, ప్రత్యేకంగా సెక్షన్‌ 8ని అమలు చేయాలని కేంద్రం ఏమైనా గైడ్‌లైన్స్‌ విడుదల చేసిందా? అని టీడీపీ సభ్యుడు అవంతి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల మధ్య సంఘర్షణను నివారించేందుకు, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం చట్టంలోని ప్రతి సెక్షన్‌పైనా గైడ్‌లైన్స్‌ విడుదల చేశారా? అని ఆయన అడిగారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ.. సెక్షన్‌ 8 అమలుకు గైడ్‌ లైన్స్‌ ఇవ్వాలన్న నిబంధన చట్టంలో లేదన్నారు. అయితే, ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు ఏపీ, తెలంగాణ ప్రతినిధులతో హోం శాఖ తరచూ సమావేశాలు నిర్వహిస్తోందని, ఇలాంటి సమావేశం మే 30న ఒకసారి జరిగిందని బదులిచ్చారు.

Also Read :  సెక్షన్ 8 కుదరకపోతే హైదరాబాద్ ను యుటి చెయ్యాల్సిందే

విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతల్ని కాపాడేందుకు ప్రత్యేక అధికారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కేంద్రం తీసుకున్న చర్యలేంటి? అంటూ బీజేపీ ఎంపీ హరిబాబు ప్రశ్నించారు. దీనికి హరిభాయ్‌ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇ స్తూ.. ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తుల భద్రతకు సంబంధించి ఉమ్మడి గవర్నర్‌కు విభజన చట్టం సెక్షన్‌ 8 ద్వారా ప్రత్యేక బాధ్యత కట్టబెట్టినట్లు తెలిపారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలక సంస్థల భద్రత, ప్రభుత్వ భవనాల నిర్వహణ, కేటాయింపు బా ద్యతలను గవర్నర్‌ నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read :  సెక్షన్ 8 అమలుపై కేసీఆర్ చెక్.. గవర్నర్ కు హెచ్చరిక

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Section 8  Hydeabad  Telangana  AP  section 8 in Hyderabad  

Other Articles