Abdul Kalam | Children | Abdul Kalam with children, Abdul kalam interact with children

Telugu content

Abdul Kalam, Children, Abdul Kalam with children, Abdul kalam interact with children

Abdul Kalam likes children and his teaching profession. He always tried to meet childern as possible as soon. He was very happy to interact with children.

కలాంకు ఈ రెండంటేనే ఇష్టం..

Posted: 07/28/2015 03:33 PM IST
Telugu content

అబ్దుల్ కలాం.. నిరాడంబరంగా జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరువని మామూలు వ్యక్తి. శాస్ర్తసాంకేతిక రంగాల్లో తన ప్రతిభా పాఠవాలతో అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి. అయితే ప్రతి మనిషి ఇష్టమైవంటూ ఏవో కొన్ని వ్యాపకాలుంటాయి. మన అబ్దుల్ కలాంకు ఒకటి కాదు రెండు వ్యాపకాలు ఉన్నాయి. ఎన్నడూ రెండు అంటే ఎంతో ఇష్టపడేవారు. అవి ఒకటి పిల్లలు అంటే చెప్పలేనంత ప్రేమ.. ఇక రెండోది లెక్చర్ ఇవ్వడం. ఈ రెండు అంటే అబ్దుల్ కలాంకు వల్లమాలిన ప్రేమ. అందుకే రోజుకు మూడు వందల మంది చిన్నాలను కలిసే వారంటే ఆయనకు చిన్న పిల్లల మీద ఎంత ప్రమేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రపతిగా కంటే చిన్న పిల్లలతో కలిసి ఉండటం అంటే అబ్దుల్ కలాంకు ఎంతో ప్రేమ అనే మాట అక్షరాల నిజం.

పిల్లలంటే అబ్దుల్‌ కలాంకు ఎంతో ప్రీతి. ఎక్కడకెళ్లినా కాసేపు వారితో గడిపి మురిసిపోయేవారు. ''ఎప్పుడూ కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలి'' అని చెప్పే కలాం.. చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ నగరానికి, ఏ కార్యక్రమం కోసం వెళ్లినా..అక్కడ ఏదో ఒక విద్యాసంస్థలో తప్పనిసరిగా ఒక కార్యక్రమం పెట్టుకునేవారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ అనంతరం కూడా కలాం విద్యారంగానికి విశిష్ట సేవలందించారు. చివరి నిమిషం వరకూ విద్యాభివృద్ధికే సమయం కేటాయించారు. చదువు.. సమాజాభివృద్ధికి ఉపయోపడేలా అబ్దుల్‌ కలాం ఎన్నో వేదికలపై విద్యార్థులకు ఉపన్యాసాలు ఇచ్చారు. తన ప్రసంగాలతో యువతలో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. నిరాశ నిస్రృహలో ఉన్న యువతలో ఆత్మ స్తైర్థ్యం నింపుతూ. ఒక మార్గదర్శకంగా నిలిచారు. ఆత్మన్యూనత భావంతో ఉన్న వారిని ఆయన ప్రసంగాలు తట్టిలేపుతాయి. అబ్దుల్‌ ప్రేరణతో ఉన్నత శిఖరాలకు ఎదగినవారేందరో ఉన్నారు. రాష్ట్రపతి పదవిని అధిష్టించి ప్రజల రాష్ట్రపతిగా పేరు గడించిన కలాం పదవి విరమణ అనంతరం విద్యాభివృద్ధికే ఎక్కువ సమయం కేటాయించారు.

చివరి నిమిషం వరకూ కలాం వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శిస్తూ.. విద్యార్థులకు సైన్స్ పాఠాలతో పాటు దేశభక్తిని పెంపొందించే సందేశాలిచ్చారు. కలాంకు పిల్లలంటే ఎంతో ఇష్టం. చివరి నిమిషాం కూడా పిల్లలతోనే గడిపారు. షిల్లాంగ్‌ ఐఐఎంలో విద్యార్థుల కోసం లివబుల్‌ ప్లానెట్‌ ఎర్త్‌ అనే అంశంపై సెమినార్‌లో పాల్గొన్నారు. అలా పిల్లలతో కలిసిపోయి వాళ్లలో ఒక పిల్లాడిలా ఆయన ఆనందించేవారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో అక్కడి విద్యార్థులతో సమావేశమయ్యేవారు. సైన్స్, టెక్నాలజీపై వారికి ఉపన్యాసమిచ్చేవారు. వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చేవారు. అంతేకాదు.. చిన్నారులకు ఓపిగ్గా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేవారు. ఆ సేతు హిమాచలం వేలాది మంది విద్యార్థులతో ఆయన చర్చల్లో పాల్గొన్నారు.

విద్యార్థులకు పాఠాలు బోధించడమంటే కలాంకు ఎంతో ఇష్టం. తన జీవితానుభవాలనే యువతకు సందేశమిచ్చేలా ''వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌'' పేరుతో ఆత్మకథను కూడా రాశారు. భారతదేశంలో ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా ఇంతటి అభిమానాన్ని పొందిన ఏకైక రాష్ర్టపతి కూడా అబ్దుల్‌ కలామే అనడంతో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ప్రతిభాపాటవాలకు ఎన్నో పురస్కారాలు, అవార్డులు వరించాయి. 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. కళాశాల కమిటీల్లో సభ్యత్వం కల్పించాయి. రామేశ్వరం నుంచి రాష్ర్టపతి అయినా అబ్దుల్‌ కలాం నిరాండబరతకు నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. అబ్దుల్‌ కలాం.. రామేశ్వరం నుంచి రాష్ర్టపతి అయినా నిరాండబరతకు ఆయన నిలువెత్తు నిదర్శనమని ప్రముఖులు కొనియాడారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles