Rithekeshwari Letter | Rishitheshwari | Nagarjuna University | Rishitheshwari mystery, AP, Govt, Chandrababu naidu. Babu Rao, Rithekeshwari suicide

Rithikeshwari wrote a last letter before suicide at nagarjuna university

Rithekeshwari Letter, Rishitheshwari, Nagarjuna University, Rishitheshwari mystery, AP, Govt, Chandrababu naidu. Babu Rao, Rithekeshwari suicide

Rithikeshwari wrote a last letter before her suicide at Nagarjuna University. Rithikeshwari describe each and every incident to her parents in her last letter.

ITEMVIDEOS: చీకటి చరిత్రకు రిషితేశ్వరి లెటర్ లో ప్రతి అక్షరం సాక్షమే

Posted: 07/27/2015 01:50 PM IST
Rithikeshwari wrote a last letter before suicide at nagarjuna university

అవి అక్షరాలు కావు.. రక్తచరిత్రను కంటికి కట్టిన కన్నీటి ధారువులు. రితికేశ్వరి సూసైడ్ నోట్ లో ప్రతి అక్షరం అందరి హృదయాలను తొలచివేస్తోంది. ఎన్నో ఆశలతో, తల్లిదండ్రుల ఆశయాలను కళ్లలో ఒత్తులుగా వేసుకొని... వేయి ఆశలతో.. కోటి నవ్వులతో క్యాంపస్ లోకి అడుగుపెట్టిన రిషికేశ్వరి తన జీవితాన్ని అర్దంతరంగా ముగించుకుంది. అమ్మా, నాన్నా , జాగ్రత్త. నాన్నా ప్లీజ్ ఏడవకండి. నేనెప్పుడు మీదగ్గర్లోనే ఉంటాను... సెలవు అంటూ ఆమె రాసిన అక్షరాల్లో ఆమె గుండె ఆవేదన వ్యక్తమవుతోంది. నాన్న గారాల పట్టి మధ్యలోనే నేల విడిచి నింగికేగింది. ఎంతో మంది రిషికేశ్వరీల మనోగతాలను తన లెటర్ లో కళ్లకు  కట్టి కడసారి వీడ్కోలు పలికింది.

Also Read:  మరో రిషితేశ్వరి ఆత్మహత్యను ఆపుదాం

‘‘నవ్వు... నవ్వు...నవ్వు... ఈ నవ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను నవ్వుతూ ఉండటమే కాదు అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయ్యింది.
మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. చదువంటే నాకు చాలా ఇష్టం. అందుకే చదువు కోసం నేను వరంగల్ వదిలి గుంటూరు వచ్చాను. ఇలా వచ్చిన నన్ను సీనియర్ విద్యార్థులు కొందరు చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నం చేశారు. నేను ఆ దారిలో వెళ్ళలేదు. దాంతో నామీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు.అవి వింటేనే నా మొహంలో నవ్వు మాయమై పోయేది. ఏడుపు వచ్చేది. నేను నాన్న దగ్గర ఏమీ దాచే దాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చాక దాయాల్సి వస్తోంది. చెప్తే ఏమై పోతారో అనే భయంతో దాయాల్సి వస్తోంది.అలా నేను దాచినప్పుడల్లా నాకు నరకం కనపిస్తుంది. నా ఆకరి కోరిక ఒక్కటే నా చావుకు కారణం ఎవ్వరో వారికి తెలుసు.వాళ్ళు తమ తప్పు తెలుసుకుంటే చాలు. ఇక ఎవ్వరినీ ఇలా బాధ పెట్టక పోతే చాలు....... ఏ తల్లి తండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచొద్దు. మీకు చెప్పలేక వాళ్ళలో వాళ్ళు దాచుకోలేక వాళ్ళకి నరకం కనపిస్తుంది. అమ్మా, నాన్నా , జాగ్రత్త. నాన్నా ప్లీజ్ ఏడవకండి. నేనెప్పుడు మీదగ్గర్లోనే ఉంటాను...... బై ఎవర్ అండ్ ఎవర్ ’’ అంటూ తన లేఖ రాసింది.

Also Read:  రిషితేశ్వరి ఆత్మహత్య - ఎన్నో ప్రశ్నలు

విద్యార్థులు అంటే చదువుకుంటూ బుద్దిగా ఉంటారు అనుకుంటే అక్కడ పొరపాటే. ప్రాణాల కన్నా కులానికి ప్రాధాన్యత ఇచ్చే నాగార్జున యూనివర్సిటి లాంటి క్యాంపస్ లో రిషికేశ్వరి రోధన అక్కడి గోడలకు తెలుసు. అక్కడి చెట్టలకు తెలుసు రిషితేశ్వరి పడిన అరణ్యరోధన అంటే ఏమిటో.. అక్కడి ప్రతి వస్తువుకు తెలుసు రిషితేశ్వరి ఎందుకు చనిపోయిందో.. కానీ తెలియందంతా మనకు మాత్రమే. కుల రాజకీయాలా లేదంటే సీనియర్ల నిర్వాకమో ప్రిన్సిపాల్ నిర్లక్షమో కానీ ఓ నిండు ప్రాణం బలైంది. రాసిన ప్రతి అక్షరం.. నాగార్జున యూనివర్సిటిలో నిర్లక్షానకి అద్దం పడుతోంది. సీనియర్ల పాశవికానికి నిదర్శనంగా నిలుస్తోంది.

#Rishiteshwari #?WeWantJustice #JusticeForRishiteshwari

By Abhinavachary

Also Read:  వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య వెనుక రియల్ మిస్టరీ ఇదే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles