netherlands woman domenic ready to marry with her pet dog after cat death | Animals

Netherlands woman domenic ready to marry with her pet dog after cat death

dog marriage, cat marriage, woman married cat, netherlands women marriage, pets marriage

netherlands woman domenic ready to marry with her pet dog after cat death : A netherlands woman domenic ready to marry with her pet dog after cat death to save animals

పిల్లి, కుక్కలతో పరిణయమాడిన మహిళ

Posted: 07/21/2015 07:41 PM IST
Netherlands woman domenic ready to marry with her pet dog after cat death

భారతదేశంలో మూఢనమ్మకాలు ప్రబలంగా వున్నాయి కాబట్టి.. కొన్ని గ్రామాల్లో పిల్లి, కుక్కలు, ఇతర జంతువులతో మహిళలు లేదా పురుషులు వివాహాలు చేసుకోవడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ విధమైన సంస్కృతి కేవలం ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా అక్కడక్కడ ఇంకా అమలులో వుంది. మొన్నటికి మొన్నే ఓ మేయర్ మొసలిని వివాహం చేసుకుని ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పైగా.. ఆ వివాహానికి జనాలు వందల్లో హాజరు కావడం మరో విశేషం. ఏదో.. చాలాకాలం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలు కావున వాటిని తప్పనసరి పరిస్థితుల్లో పాటిస్తున్నారు. కానీ.. మరీ విడ్డూరం ఏమిటంటే ఓ మహిళ తన పెంపుడు జంతువులపై అమితమైన మమకారం పెంచుకుని ఏకంగా వాటిని పెళ్లి చేసుకుని మరో ఆశ్చర్యానికి తెరలేపింది.

సాధారణంగా పెంపుడు జంతువులపై అంతులేని మమకారం పెంచుకోవడం సర్వసాధారణమే. అలా మమకారం పెంచుకోవడంతో అవి కూడా తమ విశ్వాసాన్ని ప్రదర్శించుకుంటాయిలెండి. అది వేరే విషయం. అయితే.. పెంపుడు జంతువులను మరీ పెళ్లి చేసుకునేంత మమకారం అంటే మాత్రం అందరికీ ఆశ్చర్యం కలగకమానదు. ఇందుకు నిదర్శనంగా ఓ మహిళ చేసిన సాహసమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నెదర్లాండ్స్ కి చెందిన డొమెనిక్ అనే మహిళల విచిత్రంగా తన పెంపుడు పిల్లితో వివాహం చేసుకుంది. కొన్నాళ్లు ఆ పిల్లిని పెంచుకున్న ఆమెకు దానిపై ప్రేమ పుట్టుకొచ్చిందట! దాని ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన ఆ అమ్మడు.. ఏకంగా పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే.. కొన్నాళ్లకే ఆ పిల్లి మరణించడంతో ఆమె తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఆ విషాదం నుంచి బయటపడేందుకు ఆమె మరో షాకింగ్ నిర్ణయం కూడా తీసుకుంది. అదేమిటంటే.. తన పెంపుడు కుక్క ట్రావిన్స్ ను పెళ్లాడాలని ఆమె అనుకుంటోంది. అందుకు తగిన ప్రణాళికలు కూడా ఆమె సిద్ధం చేసుకుంది.

విచిత్రంగా ఇలా పెంపుడు జంతువులను వివాహం చేసుకోవడమేంటని ఆమెని ప్రశ్నిస్తే.. ఇది జంతు సంరక్షణ కోసం చేస్తున్న ఓ ప్రయత్నం అని డొమెనిక్ వెల్లడిస్తోంది. తనలాగే ఎవరైనా తమ పెంపుడు జంతువులతో వివాహం చేసుకోవచ్చని ఉచిత సలహా ఇస్తోంది. అంతేకాదు.. అలా వివాహం చేసుకోవడానికి ఆసక్తి వుంటే తానే విర్చువల్ వివాహం చేయిస్తానని అమ్మడు మాటిస్తోంది కూడా! ఇంకో విశేషమేమిటంటే.. అలా వివాహాలు జరిపించడం కోసం ఆమె ఓ వెబ్ సైట్ ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంతో విశ్వవ్యాప్తంగా బాగానే పాపులారిటీ సంపాదించుకుంటోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dog marriage  cat marriage  woman married cat  pets marriage  

Other Articles