Talasani Srinivas Yadav Questioned Chandrababu Naidu On His Resignation in Latest Interview | Political Settairs

Talasani srinivas yadav questioned chandrababu naidu on his resignation

talasani srinivas yadav, chandrababu naidu, talasani resignation, telugu states, tdp party leaders, tdp party ministers, trs party, telangana state issued, chandrababu controversy, chandrababu news, talasani chandrababu updates

Talasani Srinivas Yadav Questioned Chandrababu Naidu On His Resignation : Telangana Minister Talasani Srinivas Yadav Questioned Chandrababu Naidu On His Resignation In Latest Media Press Meet.

ఏం బాబూ.. తలసాని ప్రశ్నకు సమాధానం ఉందా?

Posted: 07/21/2015 05:46 PM IST
Talasani srinivas yadav questioned chandrababu naidu on his resignation

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదం నెలకొంది. ఆయన రాజీనామా చెయ్యలేదని స్పీకర్ కార్యాలయం వెల్లడిస్తే.. తాను మాత్రం రాజీనామా చేశానని, స్పీకర్ కు కూడా తన రాజీనామా పత్రాన్ని అందించానని, స్పీకర్ ఆమోదించడమే తరువాయి అని పేర్కొన్నారు. తలసాని రాజీనామా వ్యవహారంపై టీడీపీ నాయకులు గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో.. ఆయన వెంటనే మీడియా సమావేశాన్ని నిర్వహించి తన రాజీనామా విషయమై మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ పార్టీకి సవాళ్లు విసురుతూనే.. తనదైన శైలిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై బాబు ఏం చెబుతారంటూ తలసాని నిలదీశారు.

ఈ క్రమంలోనే తలసాని మాట్లాడుతూ.. దేశంలోని అన్ని శాసనసభల్లో ఒకే చట్టం అమలైనప్పుడు, తెలంగాణలో వర్తించిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్ లో వర్తిస్తాయా? లేదా? అని అడిగారు. అలా వర్తించినప్పుడు.. ఇతర పార్టీల గుర్తులతో గెలిచిన అభ్యర్థులు టీడీపీ చేరినప్పుడు లేని అభ్యంతరం, తనకు మాత్రమే ఎందుకు వర్తిస్తుందని అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తలసాని ఈ విధంగా బాబుని నిలదీయడమే కాకుండా టీడీపీ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు కేవలం కాళ్లరిగేలా తిరగడమే తప్ప.. ఇంకేమీ చేయలేరని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల్లా డొంక తిరుగుడు విధానం తనకు తెలియని, ఏదైనా సూటిగానే వ్యవహరిస్తానని తలసాని స్పష్టం చేశారు.

రాజకీయం అంటే ఏమిటో తనకు కూడా బాగా తెలుసునని, తాను కూడా రాజకీయాల్లోనే వున్నానని తలసాని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలతో డ్రామాలు ఆడించడం బాబు మానేయాలని బాబుకు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఒకే చట్టాలు, నిబంధనలు అమలవుతున్నాయని ఆయన బాబుకు స్పష్టం చేశారు. తాను దేనికీ భయపడటం లేదని, ఉప ఎన్నికలకు సిద్ధంగా వున్నానని తలసాని పేర్కొన్నారు. మరి.. ఈయన ఈ విధంగా మండిపడటంపై టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talasani srinivas yadav  chandrababu naidu  

Other Articles