Godavari pushkaralu, Telangana, AP, High ways, kovvuru, Rajahmundry, Hyderabad, Nizamabad

Heavy corwd on high ways which will take godavari pushkaralu in telugu states

Godavari pushkaralu, Telangana, AP, High ways, kovvuru, Rajahmundry, Hyderabad, Nizamabad

Heavy corwd on high ways which will take Godavari Pushkaralu in Telugu states. On Yester day and today holidays, heavy rush on roads, lakhs of devotees que to Pushkar bath.

ఇసకేస్తే రాలనంత జనం.. గోదారికి పోటెత్తిన భక్తులు

Posted: 07/19/2015 12:33 PM IST
Heavy corwd on high ways which will take godavari pushkaralu in telugu states

తెలుగు రాష్ట్రాల్లో దారులన్నీ గోదారి వైపు మళ్లాయి. పుష్కర యజ్ఞం సాగుతోంది.  పుణ్య స్నానాలకు భక్తకోటి తీరానికి పయనమయ్యాయి. దీంతో ఆదిలాబాద్‌ నుంచి విశాఖ వరకూ జాతీయ రహదారులు కిటకిటలాడాయ్‌. లక్షల్లో వాహనాలు... హారన్ల మోతలతో మారుమోగిపోయాయ్‌. విశాలమైన హైవేపై కూడా పది కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది.  విజయవాడ- రాజమండ్రి జాతీయ  రహదారి నిండిపోతోంది. వేలాదిగా వాహనాలు  రోడ్డెక్కడంతో ట్రాఫిక్‌లో నరకం కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలోనూ అదే పరిస్థితి .

godavari-traffic01

చెన్నై-కోల్‌కతా జాతీయ  రహదారి స్తంభింస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు- నల్లజర్ల,  కొవ్వూరు-నిడదవోలు మార్గాల్లో ప్రయాణం చుక్కలు చూపిస్తోంది. ఎక్కువగా టోల్‌గేట్ల వద్ద రద్దీ కనిపించడంతో డబ్బులు వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్‌.

pushkar-03

ఇక హైదరాబాద్ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్,  కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని  జాతీయ  రహదారి కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం, ధర్మపురి  మార్గంలో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. చొప్పదండి నుంచి ఘాట్లకు వెళ్లే వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా మంగపేట వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari pushkaralu  Telangana  AP  High ways  kovvuru  Rajahmundry  Hyderabad  Nizamabad  

Other Articles