Jagan | Godavari Pushkaralu | Jesus | Hindu | Achennayudu, Social media

Jagan pushkarni bath pics criticied in the social media

Jagan, Godavari Pushkaralu, Jesus, Hindu, Achennayudu, Social media

Jagan Pushkarni bath pics criticied in the social media. Jagan did pushkarani bath in Kovvuru, at that time jagan has jesus cross symbol

జగన్ పుష్కర స్నానం మీద విమర్శలు

Posted: 07/17/2015 11:27 AM IST
Jagan pushkarni bath pics criticied in the social media

వైయస్ఆర్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొవ్వూరులో గోదావరి పుష్కర స్నానం చేశారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి అక్కడే పిండ ప్రధానం కూడా చేశారు. అయితే జగన్ పుష్కరస్నానం మీద తాజాగా విమర్శల వర్షం కురుస్తోంది. ఏపి మంత్రి అచ్చెన్నాయుడు జగన్ మీద విమర్శల దాడి చేశారు. ప్రభుత్వం మూడ నమ్మకాలను ప్రోత్సహిస్తోంది అంటూనే.. పుష్కరస్నానం ఎలా చేశారని మండిపడ్డారు. నమ్మకం లేకుండానే తన తండ్రి వైయస్ కు పిండప్రదానం ఎలా చేశారని కూడా ప్రశ్నించారు. వైయస్ జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలేదని... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఏర్పాట్లు చేయడంతో కుళ్లుకుంటున్నారని అందుకే ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తున్నారని అన్నారు.

Also Read:  జగన్.. చావుల మీద నువ్వు మాట్లాడటం ఏంటి.?
Also Read:  జగన్.. సెంటిమెంట్ మీద ఆయింట్ మెంట్ బాగానే పూస్తున్నాడు..!
Also Read:  జ‘గన్’ పేల్చాడు.. ఆంధ్రులను దోచాడు...?

jagan-with-cristian-pendent

 

ఇక గోదావరి పుష్కర స్నానం సమయంలో జగన్ మెడలో శిలువతో ఉండటం మీద హిందుత్వ సంస్థలు మండిపడుతున్నాయి. గోదావరి పుష్కరాల్లో ఓ పార్టీ అధినేత ఇలా అన్యమత ప్రచారం చేస్తున్నట్లుగా వ్యవహరించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ వ్యవహరించారని, నమ్మకం లేకపోతే పుష్కర స్నానం చెయ్యకుండా ఉండాల్సిందని.. అంతే తప్ప ఇలా హిందు సంస్రృతిని అవమానించడం ఏంటని వారు అంటున్నారు. ఇక జగన్ పుష్కర స్నానానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లు దీని మీద మండిపడుతున్నారు. చాలా మంది నెటిజన్లు జగన్ మీద విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంత మంది జగన్ అభిమానులు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు. జగన్ మతసామరస్యానికి ఇది ప్రతీక అని వారంటున్నారు.

By Abhinavachary

Also Read:  జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు..
Also Read:  జగన్ లుక్ కేక.. బ్లేజర్, టీ షర్ట్ అదుర్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Godavari Pushkaralu  Jesus  Hindu  Achennayudu  Social media  

Other Articles