Jagan | new look | YSRCP | jerusalem | YSJagan

Ys jagan mohan new look in t shirt and blazer

Jagan, new look, YSRCP, jerusalem, YSJagan

Ys Jagan Mohan new look in t shirt and blazer. jagan Mohan Reddy new look stills go viral in the social media. jagan in jerusalem tour.

జగన్ లుక్ కేక.. బ్లేజర్, టీ షర్ట్ అదుర్స్

Posted: 06/27/2015 08:47 AM IST
Ys jagan mohan new look in t shirt and blazer

వైయస్ఆర్ సిపి నేత జగన్ మోహన్ రెడ్డి పై పార్టీ చాలా వ్యతిరేకత ఉంది. పార్టీ అధినేతగా ఉండి, మొండి వైఖరి అవలంబిస్తున్నారనే అపవాదు ఉంది. జగన్ ఒంటెద్దుపోకడలను సహించని చాలా మంది పార్టీ నుండి బయటకు వచ్చారు. అయితే బయటకు వస్తూ వస్తూ జగన్ కు ఓ సలహా కూడా ఇస్తున్నారు. .జగన్ మోహన్ రెడ్డి మారక పోతే చాలా కష్టం, పార్టీకే నష్టం అంటూ సలహా ఇస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకున్నారో లేదా ఎప్పుడూ ఒకేలా ఉండాలా అని అనుకున్నారేమో కానీ ఈసారి తన జెరూసలేం టూర్ లో మాత్రం లుక్ మార్చారు. బ్లేజర్, టీ షర్ట్ లోజగన్ తాజాగా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు.

జననేత జగన్ ఇలా బ్లేజర్, టీ షర్ట్ లో కనిపించారు. అయితే ఇక్కడ కాదండీ బాబు. విదేశాల్లో ఈ స్టైల్లో కనిపించాడు జగన్. జెరూసెలం వెళ్లినప్పుడు ఇలా స్టైలిష్ గా కనిపించారు జగన్. లోకల్ ట్రైన్ లో ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేసిన జగన్ ఈ లుక్ లో ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. అయితే ఇది మార్ఫింగ్ అని కొందరు అంటున్నారు. జగన్ మారాలి అంటూ ఈ మధ్యన ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు గగ్గోలు పెడుతుంటే ఇలా మారిపోయారంటూ కామెంట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. రాజకీయనేతలంటే ఎప్పుడూ వైట్ అండ్ వైట్ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. అయితే జగన్ ఇందుకు విరుద్ధంగా కలర్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ తో పాలిటిక్స్ కే కొత్త కళ తెచ్చి గ్లామర్ అద్దారని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఈస్టైల్ చూస్తే నిజమేననిపిస్తుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  new look  YSRCP  jerusalem  YSJagan  

Other Articles