Fish and Frog falls from sky in Telugu state | khammam | road side vendor |

Fish falls from sky in telugu state

Fish from sky, fish falls from sky, fish from sky in Telangana, khammam, road side vendor, Khammam news, Telangana news, telugu news, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india, national news, entertainment news

A resident of Khammam town was surprised, when he found a fish that flew all away from the sky

ఔరా..! ఆకాశం నుంచి రాలిపడ్డ జలపుష్పం.. కప్ప

Posted: 07/16/2015 09:33 PM IST
Fish falls from sky in telugu state

ఆకాశం మేఘావృతం అయినప్పుడు.. పలు జీవరాసులు అకాశం నుంచి భూమ్మిదకు రాలుతుంటాయని పెద్దలు చెబుతుంటారు. ఔనా..! నిజమేనా.? అనిపించేలా వున్నా ఇది అక్షర సత్యం. ముఖ్యంగా సర్పాలు, తాబేళ్లు ఇలా ఆకాశం నుంచి నేల మీదకు రాలుతుంటాయని పెద్దలు చెబుతుంటారు. వీటిలో కూడా రెండు తలల పాములు, నక్షత్ర తాబేళ్లు అధికంగా భూమ్మిదకు చేరుతుంటాయని అంటారు. పెద్దల మాట సద్దన్నపు మూట అన్న చందంగా దీన్ని నమ్ముతుంటామే కాని.. ఇది నిజమేనా అన్న సందేహం మాత్రం మనలో ఏదో ఒక మూల ఉంటుంది.

అయితే అలాంటి అనుమానాలను పటాపంచటు చేస్తూ.. భూమ్మిదకు రాలింది ఒక జలపుష్పం. నమ్మశక్యంగా లేదా..? నిజమండి ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఇది అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలో బుధవారం ఏకధాటిగా వర్షం కురిసిన సమయంలో ఆకాశం నుంచి ఒక్కసారిగా అరుదైన చేపపిల్ల, కప్ప భూమి మీద పడ్డాయి. పడిన వెంటనే కప్ప అక్కడి నుంచి వెళ్లిపోగా.. చేపపిల్ల అక్కడే ఉన్న చిరు వ్యాపారికి దొరికింది. ఆకాశం నుంచి చేప పిల్లపడటం, మిగతావాటికంటే భిన్నంగా ఉండటంతో ఆ వ్యాపారి అందరికీ విసయాన్ని చెప్పాడు. వెంటనే పెద్ద సంఖ్యలో చిరువ్యాపారి ఇంటికి చేరుకున్న స్థానికులు దానిని పరిశీలించారు. దీంతో ఈ అరుదైన జలపుష్పం అక్కడివారిలో ఆసక్తిని రేకెత్తించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fish  sky  Frog  

Other Articles