ODI rankings: Kohli highest-ranked Indian batsman at fourth spot, Dhawan, Dhoni also in top 10

India maintain second place in icc odi rankings

ICC ODI rankings, India ICC ranking, Bangladesh ICC ranking, india, australia, team india, cricket, odi, virat kohli, shikhar dhawan, ms dhoni, india icc odi rankings, icc odi rankings india, odi rankings india bangladesh, bangladesh icc odi rankings, india zimbabwe, zimbabwe india, cricket news, cricket

Virat Kohli enters as the highest-ranked batsman tops fourth place in the Reliance ICC Player Rankings for ODI Batsmen, along with shikar dhawan and dhoni in top ten.

ఐసిసి వన్డే ర్యాకింగ్స్.. రెండో స్థానంలో సరిపెట్టుకున్న టీమిండియా

Posted: 07/16/2015 09:32 PM IST
India maintain second place in icc odi rankings

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రకటించిన వన్డే ర్యాకింగ్ లలో టీమిండియా తన రెండో స్థానాన్ని తిరిగి సొంత చేసుకుంది. జింబాబ్వేతో జరిగిన సిరీస్ లో క్లీన్ స్వీప్ చేయడంతో తిరిగి రెండో స్థానాన్ని సంపాదించుకుంది. గురువారం విడుదల చేసిన తాజా జాబితాలో అస్ట్రేలియా కన్న 14 పాయింట్లు వెనకంజలో వున్న టీమిండియా 115 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా, 129 పాయింట్లతో దూసుకెళ్తున్న అస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. కాగా, బంగ్లాదేశ్ ఈ ఏడాది వరుసగా నాలుగు సిరీస్ లను కైవసం చేసుకుని ఏడవ స్థానంలో కోనసాగుతున్నారు

బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు స్థానం లభించింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ టోర్నీల్లో రాణించిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానం సంపాదించాడు. ఇక టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 7వ ర్యాంకు దక్కించుకున్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 9వ ర్యాంకులో నిలిచాడు. టాప్-10లో స్థానం సంపాదించుకుని టీమిండియా బ్యాట్‌మెన్ సత్తా చాటగా, బౌలర్ల విభాగంలో టాప్-10లో ఒక్క బౌలర్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.

జింబాబ్వే పర్యటనలో ఐదు వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్ 12వ ర్యాంకులో నిలవగా, అక్షరపటేల్ 47వ ర్యాంకు, మోహిత్ శర్మ 51వ ర్యాంకు దక్కించుకున్నారు. కాగా, సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ 101వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. కాగా అల్ రౌండర్లలో రవించంద్రన్ అశ్విన్ కు మూడువ స్థానం లభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  team india  cricket  odi  virat kohli  shikhar dhawan  ms dhoni  

Other Articles