Muncipal strike | Hyderabad | Dharna | Somesh | GHMC, Telangana

Muncipal employees strike going on in hyderabad the muncipal employees did dharna at hyderabad for solve their problems

Muncipal strike, Hyderabad, Dharna, Somesh, GHMC, Telangana

Muncipal employees strike going on in Hyderabad. The muncipal employees did dharna at hyderabad for solve their problems.

మున్సిపల్ కార్మికుల సమ్మె ఉదృతం.. ఎక్కడి చెత్త అక్కడే

Posted: 07/12/2015 11:22 AM IST
Muncipal employees strike going on in hyderabad the muncipal employees did dharna at hyderabad for solve their problems

మున్సిపల్‌ కార్మికులు రాజధాని హైదరాబాద్‌లో కదం తొక్కారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్మికులు ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగారు తెలంగాణ ప్రజలకా.. ముఖ్యమంత్రి కుటుంబానికా.. అని ప్రశ్నించారు. మహిళా కార్మికులు పట్టుదలతో భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ సచివాలయం వైపు వెళ్లకుండా ముళ్లకంచెలు అడ్డుగా వేశారు. సమ్మెకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వ కుట్రల్ని ఎండగట్టారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడవెంకటరెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌ రమణ, నగర అధ్యక్షులు సి కృష్ణయాదవ్‌, బిజెపి రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు, దానం నాగేందర్‌తో పాటు అన్ని వామపక్షపార్టీల నేతలు కార్మికుల ఆందోళనకు మద్దతు పలికారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటాన్ని ఆపబోమని ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు స్పష్టం చేశారు.

భవిష్యత్‌ కార్యాచరణను వేదికపై నుంచే ప్రకటించారు. ఈనెల 13వతేదీన అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద సామూహిక నిరాహారదీక్షలు, 14వ తేదీ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాల్ని ప్రకటించారు. వీరి భవిష్యత్‌ కార్యాచరణకు రాజకీయపార్టీలు మద్దతు తెలిపాయి. సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్న జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌కుమార్‌పై నేతలు విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వం పంతాలకు పోవడం సరికాదని రాజకీయపార్టీల నేతలు హితవు పలికారు. తక్షణం కార్మికసంఘాలతో చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నేతృత్వంలో మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్‌సిఆర్‌హెచ్‌ఆర్‌డి)లో స్వచ్ఛ హైదరాబాద్‌ కమిటీ సమావేశాన్ని అర్ధంతరంగా వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు సమ్మెపై నిలదీస్తారనే భయంతోనే ప్రభుత్వం వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చర్చలకు రావల్సిందిగా ఏడు కార్మికసంఘాల నేతలకు సచివాలయం నుంచి వర్తమానం వచ్చింది. ప్రభుత్వం పాతపాటనే పాడింది. సమ్మె విరమించండి... సమస్యలు పరిష్కరిస్తామని కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్‌ఎయుడి సిఎమ్‌డి జనార్థన్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌కుమార్‌లు కోరారు. నిర్దిష్ట రాతపూర్వక హామీ లేకుండా సమ్మెను విరమించేది లేదని కార్మికసంఘాల నేతలు స్పష్టం చేశారు. దీంతో చర్చలు మరోమారు విఫలమయ్యాయి. మహాధర్నా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muncipal strike  Hyderabad  Dharna  Somesh  GHMC  Telangana  

Other Articles