Telangana | Notifications | Govt jobs | KCR | TPSC | Group1, Group3,All notifications , prepare for job, CGG Website , Roster

Telangana govt completed all excersies to release job notification

Telangana, Notifications, Govt jobs, KCR, TPSC, Group1, Group3,All notifications , prepare for job, CGG Website , Roster

Telangana Govt completed all excersies to release job notification. Telangana cm KCR already announce job notifications.

తెలంగాణ ఉద్యోగ ప్రకటనలకు అంతా సిద్దం

Posted: 07/10/2015 08:39 AM IST
Telangana govt completed all excersies to release job notification

తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీపై అధికార యంత్రాంగం ఎక్సర్ సైజ్  చేస్తున్నది. జూలైలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలచేస్తామని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు అనుగుణంగా అన్నిశాఖల అధికారులు తమతమ శాఖల్లోని ఖాళీల వివరాల సేకరణను ఇప్పటికే దాదాపు పూర్తిచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాల మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు అన్ని శాఖల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు అప్‌లోడ్ చేశారు. మొత్తం ఖాళీలు సుమారు 50 వేలకు చేరినట్లు సమాచారం.అయితే నూతన పరీక్షా విధానం, వయోపరిమితి సడలింపు, జోనల్ విధానం, రోస్టర్ పాయింట్ల అంశాల్లో స్పష్టత లేకపోవటంతో నోటిఫికేషన్ల జారీ ఆలస్యమవుతున్నట్లు తెలిసింది.

Also Read:  ఈ నెలాఖరుకల్లా ఉద్యోగ ప్రకటన

ఈ అంశాలపై ప్రభుత్వ 4 జీవోల జారీలో జాప్యంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని సబ్జెక్ట్ కమిటీ సూచించిన ప్రతిపాదనలపై తుది నిర్ణయాలతో జీవో వెలువడాల్సి ఉంది. ఉద్యోగార్థుల వయోపరిమితిలో సడలింపు ఎంత ఇవ్వాలన్న అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పదేండ్ల సడలింపు ఇస్తే పోలీసు వంటి యూనిఫాం సర్వీసులకు ఇబ్బంది కలుగుతుందని భావిస్తున్నారు. పదేండ్ల సడలింపు ఇస్తే కొందరు అర్హులు 54 ఏండ్ల వయసులో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుత ఉద్యోగ విరమణ నిబంధనల ప్రకారం వారు కేవలం నాలుగేండ్లు మాత్రమే సర్వీసులో ఉంటారు. అంతేకాకుండా వారికి ఇచ్చే శిక్షణ తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం సర్వీసు కాలం ఎంత ఉంటుంది అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read:  ఎప్పుడెప్పుడు.. ఉద్యోగ ప్రకటన ఎప్పుడు..?

ఈ నేపథ్యంలో వయోపరిమితి సడలింపుపై స్పష్టత రావాల్సి ఉంది. మరో కీలకాంశమైన జోనల్ విధానంపై కూడా ఉత్తర్వులు రావాల్సి ఉంది. రాష్ట్రంమొత్తం ఒకేజోన్‌గా ఉండాలా? రెండు జోన్లుగా ఉండాలా? మల్టీజోనల్‌పై నిర్ణయం ఏంటనే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లను ఉమ్మడి రాష్ట్రంలో నిలిపివేసిన రోస్టర్ పాయింట్ వద్ద నుంచి ప్రారంభించాలా? కొత్త రోస్టర్ పాయింట్ విధానం అవలంబించాలా? వాటివల్ల సర్వీసులు, పదోన్నతులకు కలిగే ఇబ్బందులు ఏమిటి? వాటిని సరిదిద్దేందుకు ఏం చేయాలి అనే విషయంలో ఆదేశాలు రావాల్సి ఉంది.

By Abhinavachary

Also Read:  తెలంగాణలో జాబుల జాతర.. జూన్ 2న ముహూర్తం..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Notifications  Govt jobs  KCR  TPSC  Group1  Group3  All notifications  prepare for job  CGG Website  Roster  

Other Articles