Telangana, Jobs, Notification, Govt jobs, KCR, Tspsc

Telangana state govt getting ready to release first notification for jobs by this month ending

Telangana, Jobs, Notification, Govt jobs, KCR, Tspsc

Telangana state govt getting ready to release first notification for jobs by this month ending. Telanagana govt propose to release the notifications as possible as soon.

ఈ నెలాఖరుకల్లా ఉద్యోగ ప్రకటన

Posted: 06/16/2015 09:18 AM IST
Telangana state govt getting ready to release first notification for jobs by this month ending

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఉద్యోగ ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. తాజాగా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు వచ్చే రెండు నెలల్లో ఇరవై ఐదు వేల ఉద్యోగాల భర్తీకీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ల జారీకి చకచకా ఫైల్లు కదుపుతోంది. అయితే ప్రస్తుతానికి  జోనల్, మల్టీ జోనల్, జిల్లా స్థాయిల్లోని పోస్టులు మాత్రమే కనిపించనున్నాయి. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల విభజన పూర్తయ్యాకే రాష్ట్ర స్థాయి పోస్టులు భర్తీ చేయనున్నారు. మరోవైపు ఖాళీలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఆయా శాఖల నుంచి రావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఇవన్నీ వచ్చాకే మొదటి విడతలో ఎన్ని ఖాళీల్లో నియామకాలు చేపడతారో స్పష్టమవుతుంది.

అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా ఇరవైఐదు వేల ఖాళీలను భర్తీ చెయ్యాలని యోచిస్తోంది. అయితే అందులొ ఎక్కువ ఖాళీలు పోలీస్ శాఖ నుండే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాతిక వేల జాబుల్లో దాదాపు సగం పోలీస్ శాఖకు చెందిన ఉద్యోగాలే ఉంటాయని సమాచారం. అయితే తెలంగాణ ప్రభుత్వం అంటున్నట్లు కలమనాథన్ కమిటి చూస్తున్న ఉద్యోగుల విభజన పూర్తయితే ఉద్యోగుల ఖాళీలపై క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. కమలనాథన్ కమిటీ ఇంతవరకు 115 శాఖల్లోని 41,517 రాష్ట్ర స్థాయి పోస్టులను విభజించి వాటిలో 11,551 భర్తీ అయి ఉన్న పోస్టులను, 5,631 ఖాళీలను తెలంగాణకు ఖాయపర్చింది. ఇటువంటి ఖాళీల్లో ఇప్పుడు నియామకాలను చేపట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ కసరత్తు అంతా పూర్తికానివ్వటమే మంచిదని సర్కారు భావిస్తోంది. దీంతో ప్రభుత్వం త్వరలో ప్రకటనలు వెలువరించే పోస్టులన్నీ జోనల్, మల్టీ జోనల్, జిల్లా స్థాయివే కానున్నాయి. అయితే తెలంగాణ ఆర్థిక శాఖ కనీసం కొన్ని ఉద్యోగ ఖాళీలనైనా భర్తీ చెయ్యాలని ఆ మేరకు కేటాయింపులకు కూడా క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి రానున్న రెండు వారాల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున మొదటి ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Jobs  Notification  Govt jobs  KCR  Tspsc  

Other Articles