vijayawada commissioner venkateswara rao appointed as ap intelligence chief

Andhra pradesh intelligence chief anuradha transferred

cash for vote, ap intelligence chief anuradha, vijayawada commissioner venkateshwara rao, chandrababu, pavan kalyan on cash for vote case, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

Andhra pradesh phone tapping bought dolldrums to ap IPS officers as intelligence chief anuradha transferred and vijayawada commissioner venkateswara rao appointed as new chief

ఫోన్ ట్యాపింగ్ అంశంలో డీజి అనురాధపై బదిలీ వేటు

Posted: 07/06/2015 01:53 PM IST
Andhra pradesh intelligence chief anuradha transferred

ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు అధికారుల మెడకు ఉచ్చులా బిగుసుకున్నాయి. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధికారినిగా వ్యవహరిస్తున్న డిజీ ఏఆర్ అనురాధపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను నిఘా విభాగం నుంచి బదిలీ చేశారు. ఈ స్థానంలో విజయవాడ పోలీస్ కమీషనర్ వెంకటేశ్వరరావును ఇవాళ నియమిస్తే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనురాధను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు.. విజయవాడ పోలీస్ కమీషనర్ గా గౌతమ్ సవాంగ్ ను నియమితులయ్యారు.

ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగుచూడటంతో ఇంటెలిజెన్స్ అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం అసంతృప్తిగా వుంది. ఈ నేపథ్యంలో నిఘా విభాగానికి చీఫ్ గా వున్న అనురాధపై బదిలీ వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే విదేశీ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు.. ముందస్తుగానే ఈమేరకు అంగీకారం తెలిపారని తెలుస్తోంది. నిఘా విభాగానికి కొత్త చీఫ్ గా విజయవాడ పోలీస్ కమీషనర్ వెంకటేశ్వరావును నియమించాలని పూనుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను.. మానుకోవాలని.. ఆయనకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అయితే తాను విదేశీ పర్యటనకు వెళ్లిన తరువాత ఈ నిర్ణయాలను అమలు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించినట్లు సమాచారం.

కాగా, బదిలీలు, నియామకాల విషయంలో చంద్రబాబు.. గత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డీని ఫాలో అవుతున్నట్లు వున్నారు. ఆయన కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తరువాత రాష్ట్రంలో శరవేగంగా బదిలీలు, నియామకాలు జరిగేవి. కాగా చంద్రబాబు మాత్రం విదేశీ పర్యటనకు వెళ్లిన తరువాత బదిలీలు, నియామకాలు చేపట్టారని పలువురు విమర్శలు వినబడుతున్నాయి.

ఇదిలావుండగా, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా విధులు నిర్వహించిన అనురాధ.. రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుడా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తీసుకున్న చర్యలను అప్పట్లో అధికారులు ప్రశంసించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంలో అమెను బాద్యురాలిగా చేసి, తెలుగు దేశం ప్రభుత్వం చర్యలు బదిలీ వేటు వేయడంపై పలువురు అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడిన తరువాత.. వారం రోజులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్ ద్వారా సంభాషించిన వీడియోలు భయటకు రావడంతో.. అప్పుడే అమెపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles