Jerusalem Mathayya | Tapping | cash for vote | AP | Police | KCR | Telangana

Service proiders clear that jerusalem mathayya call data will give after one month

Jerusalem Mathayya, Tapping, cash for vote, AP, Police, KCR, Telangana

Service Proiders clear that Jerusalem Mathayya call data will give after one month. ap police need the call data of Jerusalem mathayya.

మత్తయ్య కాల్ డేటా ఇవ్వడానికి నెల రోజులు

Posted: 07/02/2015 08:47 AM IST
Service proiders clear that jerusalem mathayya call data will give after one month

తెలంగాణ ఏసీబీ అధికారులు ఓటుకు నోటు కేసులో నాలుగొ ముద్దాయిగా ఉన్న జెరూసలెం మత్తయ్య కాల్ డేటా కోసం ఏపి ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తనను చంపుతామని బెదిరిస్తున్నారని, కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం మీద మత్తయ్య ఫిర్యాదు చేశారు. అయితే ఏపి ప్రభుత్వం అన్ని కేసులను సిట్ కు అప్పజెప్పడమే కాకుండా జెరూసలెం మత్తయ్య ఫిర్యాదు మీద ప్రత్యేక దృష్టిసారించింది. మత్తయ్య ఎవరెవరిని కలిశారు.? ఎవరెవరితో ఫోన్ మాట్లాడారు?? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో ఏ1 ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ సమయంలో కూడా ఏసీబీ మత్తయ్య ఇంకా దొరకలేదని కాబట్టి రేవంత్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ వాదించారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో మత్తయ్య, సెబాస్టియన్ మద్యవర్తిత్వం నడిపినట్లు తెలంగాణ ఏసీబీ ఆరోపిస్తోంది. కానీ మత్తయ్య మాత్రం తనను బలవంతంగా చంద్రబాబు నాయుడు పంపినట్లు చెప్పాలని వత్తిడి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అయితే మత్తయ్య వ్యవహారం బయటపడాలంటే కాల్ డాటా ఎంతో కీలకం కానుంది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటికే పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్న ఏపి పోలీసులు.. తాజాగా మత్తయ్య కేసులో మరోసారి సర్వీస్ ప్రొవైడర్లను కలిశారు. ట్యాపింగ్ వివాదంపై కొంత మంది సర్వీస్ ప్రొవైడర్లను విచారించిన ఏపి పోలీసులు తాజాగా మరోసారి మత్తయ్య కాల్ డాటా కోసం సర్వీస్ ప్రొవైడర్లను కలిశారు. అయితే జెరూసలెం మత్తయ్య కాల్‌డేటా ఇచ్చేందుకు నెలరోజుల సమయం కావాలంటున్నారు సర్వీసు ప్రొవైడర్లు. ఆ మేరకు అనుమతి కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను న్యాయస్థానం ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఏపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకూడదని భావిస్తోంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం, కేసీర్ మదీ లీగల్ గా అప్రోచ్ అయ్యేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని ఏపి ప్రభుత్వం చూస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jerusalem Mathayya  Tapping  cash for vote  AP  Police  KCR  Telangana  

Other Articles