KFC food samples in Hyderabad found containing harmful bacteria

Kfc fried chicken contains e coli salmonella hyderabad lab

KFC, Fried chicken, E. coli, Salmonella, Hyderabad, State Food Laboratory, Testing, Nestle, Maggi, Food safety, fast food, Hyderabad, kfc, KFC contaminated food, Telangana State Food Laboratory, pathogens

Tests conducted by the Telangana State Food Laboratory found the KFC food samples to contain bacteria found in human waste. The test samples contained pathogens, salmonella and E Coli bacteria. KFC lab tests,Food Safety and Standards Authority of India,FSSAI,Salmonella,Maggi

తస్మాత్ జాగ్రత్తా: కె.ఎఫ్.సీ చికెన్ లో హానికరమైన బ్యాక్టీరియా..

Posted: 06/26/2015 09:15 PM IST
Kfc fried chicken contains e coli salmonella hyderabad lab

నెస్ట్లీ సంస్థ నుండి తయారు చేయబడి భారత్ లోకి వచ్చిన మ్యాగీ నూడుల్స్ లో హానికరమైన ఎంఎస్ జీ అధిక మోతాదులో వుందని, దీని ద్వారా వాటిని సేవించిన పిల్లలు సహా పెద్దలకు కూడా పలు ఆరోగ్యకర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో భారతీయ ఆరోగ్య శాఖ అధికారులు దాడులు జరపి దేశవ్యాప్తంగా వాటిని నిషేధించారు. సుమారుగా 320 కోట్ల రూపాయల మేర మ్యాగీ నూడుల్స్ ను భారత్ మార్కెట్ల నుంచి ఉపసంహరించాల్సిందిగా అదేశాలు జారీ చేయడంతో.. వాటిని స్వాధీనం చేసుకుంది నెస్ట్లీ సంస్థ.

మ్యాగీ నూడుల్స్ అధ్యాయం ముగిసిందన్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా శాఖోపశాఖలతో విస్తరించిన ఫ్రైడ్ చికెన్ దిగ్గజం కె ఎఫ్ సీ(కెంటకీ ఫ్రైడ్ చికెన్) లోపభూయిష్టమైన నాణ్యతతో ఆహార పదార్థాలను తయారు చేస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ నగరాల్లో సామాన్య మధ్య తరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరినీ అకర్షించి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వ్యాపారాన్ని సాగిస్తున్న కె ఎఫ్ సీ భారత దేశ చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతుందని బాలల హక్కుల సంఘం అరోపించింది.

కె ఎఫ్ సీ ఆహార పదార్థాల్లో ప్రమాదకరమైన ఈ కొలి, సాంనెల్లా లాంటి బ్యాకీ్టరియాలున్నాయని బాలల హక్కుల సంఘం ఆరోపించింది. వెంటనే కె ఎఫ్ సీని నిషేదించాలని లేకపోతే ఆయా సంస్థలపై క్రిమినెల్ కేసులు పెట్టడానికి కూడా తాము వెనుకాబోమని బాలల హక్కుల సంఘం హెచ్చరించింది. అమెరికా లాంటి దేశాల్లో అక్కడి పౌరులు తినడానికి ఇష్టపడని, పదార్థాలను భారత్ లాంటి దేశాలకు తరలించి.. వాటిని ఇక్కడ అమ్మి సోమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమెరికాలో ఓ పౌరుడికి ఇటీవల చికెన్ బదులుగా ఎలుకను వడ్డించిన కె ఎఫ్ సీ.. అక్కడి కస్టమర్ తో మాట్లాడటానికి కూడా ప్రయత్నాలు చేసి విఫలమైంది. అతను న్యాయపరంగా తేల్చుకుంటానని చెప్పండంతో అతడ్ని బతిమాలే పనికి ఉపక్రమించింది. ఇక భారత్ లాంటి దేశంలో అసలేం వడ్డిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది బాలల హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. వారం రోజుల్లోపు చర్యలు తీసుకోవాలని లేకపోతే కోర్టుమెట్లు ఎక్కుతామని బాలల హక్కుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

 

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fast food  Hyderabad  kfc  KFC contaminated food  

Other Articles