Gorilla | Japan | Handsome | Australia | Nagoya | Higashiyama Zoo

Ladies were flirt for a handsome gorilla in japan

Gorilla, Japan, Handsome, Australia, Nagoya, Higashiyama Zoo

Ladies were flirt for a handsome gorilla in Japan. A gorilla who grew up in an Australian zoo has become a heartthrob among women in Japan. Shabani the gorilla, who now lives in Higashiyama Zoo and Botanical Gardens in Nagoya, has attracted a large following of admirers who visit him because he is so 'handsome'.

ఆ గొరిల్లా అందానికి అమ్మాయిలు ప్లాట్

Posted: 06/26/2015 01:28 PM IST
Ladies were flirt for a handsome gorilla in japan

పాపం మగవాళ్లు ఈ టైటిల్ చదవగానే ఇప్పటికే అందమైన అమ్మాయిల సంఖ్య తగ్గింది... హెవీ కాంపిటేషన్ ఉంది ..మాకే దిక్కు లేదనుకుంటే గొరిల్లా కూడా అమ్మాయిలకు బీటేస్తే మా పరిస్థితి ఏంటా అనుకుంటున్నారా..? కానీ వీరు చదివింది మాత్రం నిజం. అయితే ఓ జూలో ఉన్న గొరిల్లా అందానికి అక్కడ అమ్మాయిలు అలా ఫ్లాట్ అవుతున్నారట. ఏకంగా సోషల్ మీడియాలోనూ, అక్కడి టీవీ చానల్స్ లోనూ ఈ గొరిల్లా గురించే వార్తలు వస్తున్నాయి. జపాన్ లోని హిగాషియామా జూమా లో సంచలనం రేపుతున్న గొరిల్లా పేరు షబని. జపాన్ లోని ఈ గొరిల్లాకు అక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అక్కడి జూకు వచ్చే వారు ఎప్పుడెప్పుడు షబనిని చూద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. షబని కనిపిస్తే చాలు ఈ హ్యాండమ్స్ ను ఇప్పుడే కలిశాను అంటూ సోషల్ మీడియాలో అలా పోస్ట్ చెయ్యడం, దానికి వేల సంఖ్యలో లైక్ లు, కామెంట్ లు రావడం టకటకా జరిగిపోతున్నాయి. జపాన్ టీవీ ఛానల్స్ లోనూ షబని పాపులర్ విఐపిగా మారింది.

జపాన్ లోని నయోగాలో ఉన్న హిగాషియామా జూమా జూకు 2007లో షబని వచ్చింది. అయితే సిడ్నీలోని టారొంగా జూ నుండి షబని జపాన్ కు వచ్చింది. అయితే ఇక్కడి జూకు వచ్చే వారిలో చాలా మంది షబని కనిపిస్తే చాలు తమ ఫోన్లో క్లిక్ మనిపిస్తున్నారు. మోస్ట్ హ్యాండమ్స్, గుడ్ లుకింగ్ అంటూ అమ్మాయిలు చేస్తున్న పోస్టులు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇంత అందగాడిని ఎప్పుడూ చూడలేదని అమ్మాయిలు చేస్తున్న కామెంట్లు అబ్బాయిలకు కోపాన్ని, షబినికి మాంచి పాపులారిటిని తెచ్చిపెడుతున్నాయి. అమ్మాయిల కామెంట్లు, పోస్టుల సంగతి ఏమో కానీ ఆ గొరిల్లా చేసే కొంటె చేష్టలకు ఎవరైనా ఫ్లాట్ కావాల్సిందే. పెద్ద పెద్ద మోడల్స్ ఇచ్చే స్టిల్స్ లాగా కెమెరా కళ్లకు మరింత అందంగా ఫోజులిస్తూ అందరిని ఆకర్షిస్తోంది ఈ గొరిల్లా. మరి మీకూ ఈ గొరిల్లాను చూడాలనుకుంటే జపాన్ కు బయలుదేరండి.

*అభినవచారి*a

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gorilla  Japan  Handsome  Australia  Nagoya  Higashiyama Zoo  

Other Articles