BJP steps back on vasundhara raje resignation | lalit modi scandal | Ipl Controversy

Bjp steps back on vasundhara raje resignation in lalit modi scandal

vasundhara raje, vasundhara raje news, vasundhara raje images, vasundhara raje controversy, vasundhara raje resignation, lalit modi scandal, lalit modi scandal news, bjp, bjp controversy, sushma swaraj, sushma swaraj controversy

BJP steps back on vasundhara raje resignation in lalit modi scandal : BJP steps back on Rajasthan Chief Minister vasundhara raje resignation as she put a condition infront of them in lalit modi scandal controversy.

వసుంధర ‘రాజీ’నామాకు సిద్ధమే కానీ..!

Posted: 06/26/2015 11:40 AM IST
Bjp steps back on vasundhara raje resignation in lalit modi scandal

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యవహారం బీజేపీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అతనికి మద్దతుగా నిలవడంతో బీజేపీకి మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. లలిత్ మోదీ మంచోడేనంటూ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ కు వసుంధర లేఖ రాయగా.. ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే ఆమె సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఈ వివాదం మరింత పెరుగుతున్న నేపథ్యంలో చివరికి ఆమె స్పందించారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని ప్రకటించిన ఆమె.. ఒక చిన్న మెలిక పెట్టింది.

ఆ మెలిక ఏమిటంటే.. ‘లలిత్ మోదీ’ వివాదంతో సంబంధమున్న ప్రతిఒక్కరు పదవులు వీడాలని ఆమె తెలిపింది. ఇదే విషయాన్ని ఆమె బీజేపీ పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ కాస్త వెనక్కు తగ్గి.. రాజీనామా విషయాన్ని పక్కనపెట్టారని సమాచారం. ఈ మెలికతో వసుంధర రాజే ఎలాగోలా తన సీఎం పదవిని కాపాడుకోవడంలో కాస్త విజయం సాధించిందనే చెప్పుకోవాలి. కాగా.. ఈ కేసులో సుష్మాస్వరాజ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమె కూడా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరి.. ఈమె ఏ విధమైన అస్త్రాన్ని వదులుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vasundhara raje  lalit modi scandal  sushma swaraj  bjp  

Other Articles