cash for vote scam audio video tapes are original says fsl

Forensic officials hand over cash for vote scam tapes report to court

FSL report, ACB court, union home ministry, note for vote, governer, chandrababu, KCR, High Court Judge, RGV, muthaiah jerusalem, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, horse riding

forensic science officials hand overs cash for vote scam audio, video tapes report to acb court

ఆ టేపుల్లో ఎడిటింగ్ జరగలేదట.. ఏసీబి కోర్టుకు ఎప్ఎష్ఎల్ నివేదిక

Posted: 06/24/2015 11:10 PM IST
Forensic officials hand over cash for vote scam tapes report to court

ఓటుకు నోటు కేసులో ఏసీబి అధికారులు అందించిన టేపులపై పరిశీలన జరిపిన ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీస్ (ఎఫ్ఎస్ఎల్) ఏసీబీ కోర్టుకు ప్రాథమిక నివేదిక అందింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్ మధ్య జరిగిన సంభాషణలు, స్టీఫెన్ సన్ ఇంట్లో రికార్డయిన దృశ్యాలు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీఫెన్ సన్‌తో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులకు సంబంధించిన వివరాలను ఎఫ్ఎస్ఎల్ అధికారులు బుధవారం తమ ప్రాథమిక నివేదికను ఏబీసీ కోర్టులో సమర్పించారు.

అయితే ఈ కేసుకు సంబంధించిన తమకందిన టేపులన్నీ నిజమైనవేనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్ ఆరోపించినట్లు అవి కట్ అండ్ పేస్ట్ టేపులు కావని.. ఎక్కడ క్రోడీకరణ జరగలేదని ఎఫ్ఎస్ఎల్ అధికారులు అంచనా వచ్చినట్లు సమాచారం. ఈ టేపుల్లో ఎలాంటి ఎడిటింగ్ కానీ, మార్పులు గానీ జరగలేదని ఎఫ్ఎస్ఎల్ అధికారులు స్పష్టం చేశారు. ఈ టేపుల్లో రికార్డయిన స్వరాన్ని పూర్తిస్థాయిలో నిర్థారించేందుకు చంద్రబాబుతో పాటు నిందితుల స్వర నమూనాలను ఇప్పించాలని ఎఫ్ఎస్ఎల్ అధికారులు కోర్టును ఇప్పటికే కోరారు.

దీంతో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ క్షణంలోనైనా స్వర నమూనాలు ఇవ్వాలంటూ ఏసీబి కోర్టు అదేశించే అవకాశాలు వున్నాయని తెలుస్తుంది. కాగా ఈ నివేదిక సంబంధించిన ఒక కాపీని తమకు ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ మేరకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక కాపీ ఏసీబీకి అందాక ఈ కేసులో నిందితులపై తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : note for vote  TDP  chandrababu  phone tapping  FSL report  ACB court  

Other Articles