Red Carpet for Nitin Gadkari Caught in His Helicopter's Rotor Blades

Narrow escape for union minister nitin gadkari

Narrow escape for Union minister Nitin Gadkari, Nitin Gadkari, Union Minister Nitin Gadkari, senior Union Minister Nitin Gadkari, Helicopter accident, Nitin Gadkari close call, Haldia, West Bengal, entangled with the rotor blades, Nitin Gadkari Narrow escape, helicopter

The red carpet laid out for senior Union Minister Nitin Gadkari in West Bengal today got entangled with the rotor blades of his helicopter when the politician landed in Haldia

ITEMVIDEOS: నితిన్ గడ్కరీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Posted: 06/24/2015 06:47 PM IST
Narrow escape for union minister nitin gadkari

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి పెనుప్రమాదం తప్పింది. పశ్చిబెంగాల్‌లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న క్రమంలో ఆయన ఈ ప్రమాదానికి లోనయ్యారు. హెలికాప్టర్ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో నితిన్ గడ్కరీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్లే.. పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకై బుధవారం హెలికాఫ్టర్‌లో నితిన్‌ బయలుదేరి వెళ్లారు. సీనియర్ కేంద్ర మంత్రి తమ జిల్లాకు వస్తున్నందున జిల్లా అధికారులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్ వేసి వెల్ కమ్ చేప్పేందుకు సన్నధమయ్యారు.

సరిగ్గా నితిన్ గడ్కరీ హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న క్రమంలో అప్పటికే పరిచిన ఎర్ర తివాచీ.. విమానం రెక్కల గాలికి పైకి లేచి ..రెక్కల రూటర్‌ బ్లేడ్స్‌కు క్లాత్‌ పట్టుకుంది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన ఫైలట్.. చాకచక్యంగా కిందకు  హెలికాఫ్టర్ ను దించడంతో.. ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. అయితే తనకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని తాను సురక్షితంగా ఉన్నానని గడ్కరీ తెలిపారు. హెలికాప్టర్ కు కూడా ఏమీ కాలేదని, మళ్లీ ఎగిరేందుకు కూడా సిద్దంగా వుందని అధికారులు తెలిపారు. కాగా నితిన్ గడ్కారీ మాత్రం హల్దియా నుంచి కోల్ కత్తాకు రోడ్డు మార్గంలోనే తిరిగి వెళ్లారు. ఇందుకు స్థానికంగా వున్న ప్రతికూల వాతావరణమే కారణంగా అధికారులు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitin Gadkari  Helicopter accident  Narrow escape  West Bengal  

Other Articles