‘Titanic’ composer James Horner feared dead in Southern California plane crash

James horner titanic composer dies in plane crash

James Horner, 'Titanic' Composer, Dies in Plane Crash, James Horner, Music composer, Hollywood, Titanic, dead, plane crash, Santa Barbara, Braveheart, A Beautiful Mind, Avatar, Aliens, Apollo 13, hollywood director, hollywood music director

James Horner, an Academy Award-winning composer best known for scoring the 1997 blockbuster “Titanic,” is missing and feared dead after one of his planes crashed in Southern California on Monday morning.

విమాన ప్రమాదంలో అసువులు బాసిన హాలీవుడ్ సంగీత దిగ్గజం..

Posted: 06/23/2015 01:41 PM IST
James horner titanic composer dies in plane crash

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన విమాన ప్రమాద దుర్ఘటనలో ప్రఖ్యాత హాలివుడ్ దర్శకుడు జేమ్స్ హర్నర్ అసువులు బాసారు. టైటానిక్ చిత్రంతో యావత్ ప్రపంచాన్ని తన సంగీత సుస్వరాలలో ఒలలాడించిన సంగీత దిగ్గజం, అస్కార్ అవార్డు గ్రహీత.. దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదంలో మరణించినట్లు అక్కడి పోలీసులు దృవీకరించారు. హర్నర్ సోంత అవసరాల కోసం కోనుగోలు చేసుకున్న చిన్న విమానం (అపోలో 13)లో తన నివాసం నుంచి సోమవారం నాడు బయలుదేరి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని జాడ కోసం అన్వేషణ కొనసాగించగా, దక్షిణ కాలిఫోర్నియా సమీపంలోని శాంతా బార్బరా కు 60 మైళ్ల దూరంలో హర్నర్ విమానం కూలిపోయిందని గుర్తించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హర్నర్ మరణించిన విషయాన్ని ఆయన సహాయకుడు సిల్వియా దృవీకరించారు. హాలీవుడ్ సినిమా ఓ అద్బుతమై సంగీత దర్శకుడిని కోల్పయిందని సామాజిక మాద్యమంలో ఫోస్ట్ చేశారు. హర్నర్ టైటానిక్ చిత్రానికి సంగీతం అందించి రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు దీంతో పాటు అవతార్, బ్రేవ్ హార్ట్ , ఏ బ్యూటిఫుల్ మైండ్ , ఏలియన్స్, వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించారు .

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : James Horner  Music composer  Hollywood  

Other Articles