Pakistan, ISIS flags waved in Kashmir, Nitish mocks Modi, asks where is 56-inch chest

Where is 56 inch chest asks nitish kumar

jammu kashmir, isis flags, seperatists, bihar, isis, Narendra Modi, Nitish Kumar, pakistan, Islamic State (IS), Isis flag, Jammu and Kashmir, Prime Minister Narendra Modi, PM Modi, 56 inch chest,

Bihar Chief Minister Nitish Kumar expressed concern over raising of flags of terror group ISIS and Pakistan in JK and referring to Prime Minister Narendra Modi asked "what happened to his 56 inch chest

మోడీపై విరుచుకుపడ్డ నితీష్.. 56 అంగుళాల ఛాతి ఎక్కడని నిలదీత..?

Posted: 06/14/2015 01:15 PM IST
Where is 56 inch chest asks nitish kumar

ప్రధాని నరేంద్ర మోదీపై బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి విరుచుకుపడ్డారు. కాశ్మీర్ లో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తరువాత అక్కడి వేర్పాటు వాదులు ఇస్లామిక్ స్టేట్ జెండాలు ఎగురువేయడంపై ఆయన ప్రధానమంత్రి మోడీపై సూటీగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు మందు మోదీ భారత ఆర్మీ దళాలకు చెందిన సైనికులు 56 అంగుళాల చాతి బలాన్ని వినియోగించుకోవడంలో విఫలమైందని విమర్శలు గుప్పించడంతో.. ఇప్పుడు వాటినే నితిష్ కుమార్ అస్త్రాలుగా మలుచుకున్నారు.

కశ్మీర్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జెండాలు ఎగురువేస్తుంటే మోదీ ఛాతి బలం ఎక్కడకెళ్లిందని తీవ్రంగా విమర్శించారు. గత సాధారణ ఎన్నికల్లో తన ఛాతి బలాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన మోదీ.. బీజేపి మద్దతుతో పిడిపీ నేతృత్వంలో ఏర్పాటైన  జమ్మూ కళ్మీర్ లో ప్రభుత్వంలో.. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల జెండాలు ఎగురవేస్తుంటే ఏమి చేస్తున్నారని నిలదీశారు. 'మోదీజీ ఇప్పుడు మీకు ఏమైంది?, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై చర్యలు ఏవి?, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారా?, ఆ 56 అంగుళాల ఛాతి బలం ఎక్కడ? అని నితీష్ సూటిగా ప్రశ్నించారు.

శ్రీనగర్లోని ఓ మసీదు వద్ద శుక్రవారం మధ్యహ్నం ప్రార్థనల అనంరతం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. అలాగే జమ్ములోని కుప్వారా జిల్లాతో పాటు కాశ్మీర్లో కూడా పాకిస్థానీ జెండాలు మళ్లీ కనిపించాయి. హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ మద్దతుదారులు ఇస్లామిక్ స్టేట్ జెండాలను జమామసీదు సమీపంలో ఎగరేశారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో పాకిస్థానీ, లష్కరే తాయిబా జెండాలు కూడా కాశ్మీర్ లోయలో కనిపించినా.. ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి కావడంతో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రం మొతక వైఖరి కారణంగానే ఇలాంటి చర్యలకు వేర్పాటు వాదులు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar  isis  Narendra Modi  Nitish Kumar  56 inch chest  

Other Articles