Shabir ali, Balakrishna, Chandrababu, ap, TDP

Congress party senior leader shabbir ali demand to do balakrishna as ap cm

Shabir ali, Balakrishna, Chandrababu, ap, TDP

Congress party senior leader Shabbir ali demand to do balakrishna as ap cm. Shabbir ali attacked on TDP president Narachandrababu naidu in the note for vote scandal.

బాలకృష్ణను ఏపి సిఎం చెయ్యాలా..?

Posted: 06/08/2015 04:19 PM IST
Congress party senior leader shabbir ali demand to do balakrishna as ap cm

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు చనిపోయిన తర్వాత నందమూరి వారసులు కాకుండా.. ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న ఓటుకు నోటు వ్యవహారంలో కొత్త పల్లవి తెర మీదకు వస్తోంది. అదేంటీ అనుకుంటున్నారా..? తెలుగుదేశం పార్టీ వారసుడిగా ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటున్న, చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు ఏపి సిఎంగా పదవి పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పేరుతో విడుదలైన ఆడియో టేపులు చంద్రబాబు నాయుడు మీద విమర్శలకు తావిస్తోంది. అయితే ఇదే అవకాశం గా అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మీద విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర బయటపడడంపై స్పందించిన ఆయన డబ్బు రాజకీయాలు మొదలు పెట్టిందే చంద్రబాబు అని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ.  1995 నుంచి చంద్రబాబు రాజకీయ చదరంగం మొదలు పెట్టారని, అదే రాజకీయ చదరంగంలో బాబు ఇరుక్కున్నారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు, కేసీఆర్‌లది గురు శిష్యుల బంధమని షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నైతికత ఉంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్‌ ఆత్మకు శాంతికలగాలంటే ఆయన తనయుడు బాలకృష్ణకు సీఎం పదవి ఇవ్వాలని సూచించారు. మొత్తానికి ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే మాత్రం తన కొడుకు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని చూస్తున్నారని వార్తలు వస్తున్న టైంలోనే.. షబ్బీర్ అలీ బాలకృష్టను ఏపికి సిఎంగా చెయ్యాలని డిమాండ్ చెయ్యడం చర్చకు దారితీసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shabir ali  Balakrishna  Chandrababu  ap  TDP  

Other Articles