30 foot tall sunflower breaks Guinness World Record | Hans-Peter Schiffer | 9.17 metre

30 foot tall sunflower breaks guinness world record

Hans-Peter Schiffer, sunflower, Guiness World Record, Flower, plants, 9.17 metre (30 feet 1 inch) sun flower plant.

Hans-Peter Schiffer has once again surpassed his legendary sunflower growing skills with a massive 9.17 metre (30 feet 1 inch) plant.

ITEMVIDEOS: గిన్నిస్ రికార్డులకు ఎక్కిన అతిపెద్ద పోద్దు తిరుగుడు పువ్వు..!

Posted: 06/07/2015 05:58 PM IST
30 foot tall sunflower breaks guinness world record

మనిషి తన కృషిని బట్టి ఫలితాన్ని సాధిస్తాడని, అతనేం విత్తనం నాటితే.. అదే పండు కోసుకుతింటాడని పెద్దల నానుడి. వారెలా చెప్పినా.. అది అనుభవపూర్వకంగానే చెప్పారని మనం గ్రహించకపోతే అది మన పోరబాటే అవుతుంది. అది పెద్దల మాట సద్దన్నపు మూటగా భావించిన జర్మనీ దేశానికి చెందిన ఓ గార్డెనర్.. ఏకంగా తన పోలంలో పెంచిన పొద్దు తిరుగుడు పువ్వును గెన్నీస్ రికార్డులకు ఎక్కించారు. అదెంటి.? పొద్దు తిరుగుడు పువ్వులతో గెన్నీస్ రికార్డులకు ఎక్కుతారా..? అ వువ్వులో అంత స్పెషాలిటీ ఏముంది అని అనుకుంటున్నారా..?

జర్మనీలోని నాడ్రిహెన్ వెస్ట్ పాలెన్ ప్రాంతంలోని కార్ట్స్ పట్టణానికి చెందిన గార్డనెర్ హన్స్ పీటర్ షిఫ్పర్ ఏకంగా 9.17 మీటర్ల ఎత్తు..( సుమారుగా 30 అడుగుల 1 అంగుళం) పోద్దు తిరుగుడు పువ్వును పెంచాడు. గతంలోనే ఆయన మూడు పర్యాయాలు పొద్దు తిరుగుడు పువ్వులను అత్యంత ఎత్తుగా పెంచాడు. 2009లో 8.03 మీటర్లు, 2012లో 8.23 మీటర్లు ఆ తరువాత 2013లో 8.75 మీటర్ల ఎత్తున పెంచారు. అయితే క్రితం కన్నా ఈ సారి తన పొద్దు తిరుగుడు పువ్వు మరింత ఎత్తుగా పెరగడంతో.. ఆయన సంబ్రమాశ్చర్యాలలో మునిగారు. దీంతో ఆయన గిన్నిస్ రికా్డు అధికారులను సంప్రదించారు. గతంలో కన్నా ఎత్తుగా తన పోద్దు తిరుగుడు పువ్వు వుందని చెప్పడంతో.. పరిశీలించిన అధికారులు ఆ పుష్సానికి గెన్నీస్ రికార్డును కల్పించారు. అంతేకాదు తన తోటలో మరన్ని పుష్పాలు అంతకన్నా ఎత్తుగా ఎదుగుతాయని తాను అశాభావం వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunflower  Guiness World Record  Flower  plants  

Other Articles