aarthi agarwal was innocent says director vijay bhaskar

Tollywood mourns the death of aarti agarwal

Arthi Agarwal Dead, Actress Arthi Agarwal Dead, Arthi Agarwal Death, Heroine Arthi Agarwal Passed Away, Telugu Heroien Arthi Agarwal, Tollywood Actress Arthi Agarwal Dead, Arthi Agarwal, no more, liposuction surgery, tollywood news, innocent, vijay bhaskar, venkatesh, suresh babu

Tollywood celebrities and many of her friends from the film family is in deep sorrow, to accept the news that Arthi Agarwal is no more.

ITEMVIDEOS: ఆర్తీ హఠాన్మరణం పట్ల టాలీవుడ్ దిగ్ర్భాంతి

Posted: 06/06/2015 04:59 PM IST
Tollywood mourns the death of aarti agarwal

ఆర్తి అగర్వాల్ హఠాన్మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. అమె మరణించారన్న వార్తలను ఇప్పటికీ టాలీవుడ్ జీర్ణంచుకోలేకపోతుంది. అమెరికాలోని న్యూజర్సీలో గల అట్లాంటిక్ సిటీ ఆస్పత్రిలో లైపోసెక్షన్ చేయుంచుకన్న ఆర్తీ.. అది వికటించడంతో సర్జరీ జరిగిన రెండు రోజుల్లోనే మరణించింది. అమె మరణం వార్త తెలియగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాధచాయలు అలుముకున్నాయి. అయితే 31 ఏళ్లలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఆర్తి మరణవార్తను అమె అభిమానులతో పాటు.. అమె బంధువులు కూడా నమ్మలేకపోతున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి నువ్వునాకు నచ్చావ్ సినిమా ద్వారా పరిచమైన ఆర్తీని రామానాయుడు స్టూడియోస్ బ్యానర్ పై పరిచయం చేయించిన నిర్మాత సురేష్ బాబు, అమె సరసన హీరోగా నటించిన విక్టరీ వెంకటేష్.. ఆర్తీ మృతిపై స్పందించారు. చాలా చిన్న వయస్సులో అమె మరణించడంపట్ల తాము విషాదంలో మునిగినట్లు చెప్పారు. అసలు ఇది నిజమేనా..? అన్న అనుమానాలు తమకింకా కలుగుతున్నాయన్నారు. ఆర్తీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆర్తీ ఆకస్మిక మృతిపట్ల తామేమీ మాట్లాడలేకపోతున్నట్లు, అమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇక మరికోందరు చిత్రపరిశ్రమ సభ్యులు అమె మరణవార్తపై సామాజిక మాద్యమం ట్విట్టర్ లో స్పందిస్తున్నారు.

ఆర్తీ అగర్వాల్ చాలా మంచి అమ్మాయని, చిన్న వయసులోనే చనిపోవడం దురదృష్టకరమని దర్శకుడు విజయ్ భాస్కర్ అన్నారు. ఆర్తి మరణించారనే వార్త విని షాకయ్యానని చెప్పారు. టాలీవుడ్లో ఆర్తి తొలిసారి విజయ్ భాస్కర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నటించారు. 2001లో ముంబైలో ఆర్తి ఫొటో చూసిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లడి సినిమాలో నటించే అవకాశం ఇచ్చానని విజయ్ భాస్కర్ గుర్తు చేసుకున్నారు. ఆర్తి చాలా అమాయకురాలని, కష్టపడేతత్వమని చెప్పారు. అప్పట్లో ఆమెకు అనారోగ్య సమస్యలున్నట్టు తనకు తెలియదని, ఆ తర్వాత వచ్చి ఉండొచ్చని విజయ్ భాస్కర్ అన్నారు. ఆర్తికి మంచి భవిష్యత్ ఉంటుందని అనుకున్నానని, చిన్న వయసులో చనిపోవడం బాధాకరమని విజయ్ భాస్కర్ అన్నారు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ సరసన ఆర్తి నటించిన నువ్వు నాకు నచ్చావు ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో మంచి గుర్తింపు పొందిన ఆర్తి ఆ తర్వాత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arthi Agarwal  innocent  vijay bhaskar  venkatesh  tollywood news  

Other Articles