Actress aarti agarwal passes away,

Telugu avtress aarti agarwal is no more

Arthi Agarwal Dead, Actress Arthi Agarwal Dead, Arthi Agarwal Death, Heroine Arthi Agarwal Passed Away, Telugu Heroien Arthi Agarwal, Tollywood Actress Arthi Agarwal Dead, Arthi Agarwal, no more, liposuction surgery, tollywood news

Famous Telugu heroine Arthi Agarwal well known with the film Nuvvu Naaku Nachav is no more she was found dead

ఫ్లాష్.. ఫ్లాష్.. సినీనటి ఆర్తీ అగర్వాల్ కన్నుమూత

Posted: 06/06/2015 03:21 PM IST
Telugu avtress aarti agarwal is no more

నిన్న మెన్నటి వరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి ఆర్తీ అగర్వాల్ హఠాన్మరణం చెందారు. అగ్రరాజ్యం అమెరికాలో లైపో సెక్షన్ చికిత్స చేయించుకుంటుండగా, అది వికటించి అమె మరణిచింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అమె అనారోగ్యంతో భాదపడుతుందని, చికిత్స పొందుతూ అది వికటించి మరణించిందని అంటున్నారు. అమె మరణించిన వార్త.. తెలుగు సినీ ఇండస్ట్రీని విషాధంలో ముంచివేసింది.

తెలుగనాట అగ్రశేణి హీరోలు.. మెగాస్టార్ చిరంజీవి, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ హాస్యనటుడు సునీల్, తరుణ్, తదితర నటులతో పలు చిత్రాలలో నటించి.. తన నటనాభినయాన్ని ప్రధర్శించిన ఆర్తీ అగర్వాల్ లేదన్న వార్తతో తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి లోనైయింది. తన వివాహంతో అమెరికాలో సెటిల్ అయిన ఆర్తీ.. ఆ తరువాత కొన్ని సమస్యలతో భర్తకు విడాకులిచ్చారు. ఆ తరువాత తన తల్లిదండ్రులతో కలసి అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో నివసించిందామె. దీంతో మరోమారు తిరిగి సినిమా రంగంలో ప్రవేశించేందుకు రెడ్డీ అయ్యింది. ఈ నేపథ్యంలో లైపోసెక్షన్ చేయించుకునే క్రమంలో న్యూజెర్సీలోని ఓ ప్రైవేటు అస్పత్రిలో మరణించింది. అమెకు సర్జరీ చేసిన వైద్యులు పర్యవేక్షణలో వుంచిన సమయంలో రెండు రోజుల తరువాత ఆర్తీ మరణించింద. ప్రస్తుతం అమె మృతదేహం అట్లాంటిక్ సిటీలోని స్టేట్ ఫ్యూనరల్ హోంలో భద్రపర్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arthi Agarwal  no more  liposuction surgery  tollywood news  

Other Articles