Rain, Chandrababunaidu, ap, capital, pooja

Ap cm chandrababu naidu said that rain will fall by remembers the name of ntr

Rain, Chandrababunaidu, ap, capital, pooja

Ap cm Chandrababu Naidu said that rain will fall by remembers the name of NTR. In ap capital city pooja meeting chandrababu naidu pronounce interesting statements about the NTR and Rain.

ఆ పేరు చెబితే చాలు వర్షం వస్తుందట..!

Posted: 06/06/2015 03:07 PM IST
Ap cm chandrababu naidu said that rain will fall by remembers the name of ntr

సకాలంలో వర్షాలు రావాలని, బీడు భూములను బాగా పండాలని ఆకాశం వైపు వర్షం కోసం ఎదురుచూస్తాడు రైతు.అయితే వర్షాలు కొన్నిసార్లు అస్సలు పడకపోవచ్చు. గతంలో ఉమ్మడి ఏపిలో కూడా వర్షాలు పడకపోతే మేఘోమదనం చేసి మరీ వర్షాలు కురిసేలా చేశారు. అలా వర్షం గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద హిస్టరీయే వస్తుంది. అయితే తాజాగా ఓ బాబు గారు మాత్రం ఒకరి పేరు చెబితే చాలు వర్షం కురుస్తుంది అంటున్నారు. అవును ఆయన పేరు చెబితే చాలు వర్షం అలా వస్తుంది అంటున్నారు. ఈ మాటలు ఎవరు అన్నారో తెలుసా..? ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అవును రాజధాని భూమి పూజలో పాల్గొన్న ఆయన తర్వాత సభలో మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చారు.

అమరావతి భూమి పూజ ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అయితే భూమి పూజకు ముందు వాతావరణం మారింది. తెల్లవారుజామున ఈదురుగాలులు వచ్చినా.. తర్వాత వాతావరణం ప్రశాంతంగా మారింది. అయితే సభలో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎవరి పేరు చెబితే తెలుగునేల పులకిస్తుందో.. ఆ మహానుభావుడే స్వర్గీయ నందమూరి తారకరామారావు. అలాంటి మహానేత ఆశిస్సులు మనవెంట ఉన్నాయి అని అన్నారు. అలాగే ఆయన పేరు చెబితే చాలు ఆకాశం నుండి వర్షం పడుతుందని వెల్లడించారు.మహానాడులో కూడా ఎన్డీఆర్ పేరు చెబితే వర్షం కురిసిందని.. మనల్ని ఆశిర్వదిస్తూ ఆకాశం నుండి వర్షం కురిపిస్తారని చంద్రబాబు తెలిపారు. మొత్తానికి ఎన్డీఆర్ పేరుకు వర్షానికి భలే లింక్ చేశారు చంద్రబాబు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  Chandrababunaidu  ap  capital  pooja  

Other Articles