Former BSP MLA gets 10 years in jail in rape case

10 year jail for ex mla for raping maid

Former BSP MLA gets 10 years in jail in rape case, Dhananjay Singh, Former Bahujan Samaj Party legislator, Purushottam Naresh Dwivedi, Delhi, Jagriti, maid murder case, Bahujan Samaj Party, special CBI court

Former Bahujan Samaj Party (BSP) legislator Purushottam Naresh Dwivedi was sentenced to 10 years in prison by a special CBI court on Friday for raping his maid servant.

పనిమనిషిని చెరిచినందుకు.. మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలుశిక్ష

Posted: 06/05/2015 10:23 PM IST
10 year jail for ex mla for raping maid

తన ఇంట్లో పనిచేసే పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో ఓ మాజీ ప్రజా ప్రతినిధికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా అభియోగాలను ఎదుర్కోంటున్న నలుగురిలో ఇద్దరికి రెండేళ్ల శిక్షను విధించిన న్యాయస్థానం మరో ఇద్దరిని నిర్దోషులగా విడిచిపెట్టింది. 2010లో జరిగిన ఈ కేసుపై ఇవాళ తుది తీర్పును వెల్లువరించింది న్యాయస్థానం. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీఎస్పీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తం నరేష్ ద్వివేదీకి సీబీఐ ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. దాంతోపాటు ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించింది. అందులో సగం బాధితురాలికి పరిహారంగా చెల్లిస్తారు. ద్వివేదీతో పాటు మరో ఇద్దరు సహ నిందితులు రాం నరేష్, వీరేంద్రకుమార్ శుక్లాలకు రెండేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ. 2వేల వంతున జరిమానా విధించారు.

ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాజేంద్రశుక్లా, సురేష్ నేతలను నిర్దోషులుగా విడిచిపెట్టారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక జడ్జి వీకే శ్రీవాస్తవ తీర్పు ఇచ్చారు. 2010లో అప్పటికి 17 ఏళ్ల వయసున్న బాధితురాలు.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసేది. డిసెంబర్ పదో తేదీన ఆమెను చోరీ కేసులో ఇరికించి, పారిపోతోందని చెప్పి.. ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో నాటి సీఎం మాయావతి సీబీసీఐడీ విచారణ జరిపించి, ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు సూచన మేరకు సీబీఐ చేతికి వెళ్లింది. తాజాగా ఆ మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలుశిక్ష పడింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhananjay Singh  Purushottam Naresh Dwivedi  maid murder case  CBI court  

Other Articles