ACB, telangana, Revanth Reddy, Chandrababunaidu, Notices

Telanagana acb officails decided to summons the ap cm chandrababu naidu

ACB, telangana, Revanth Reddy, Chandrababunaidu, Notices

Telanagana ACB officails decided to summons the ap cm chandrababu naidu. Already ACB officers arrested the Reventh Reddy in note for vote scandal.

చంద్రబాబుకు ఎసిబి నోటీసులు..!

Posted: 06/05/2015 01:01 PM IST
Telanagana acb officails decided to summons the ap cm chandrababu naidu

ఓటుకు నోటు వ్యవహారంలో ఏపి సిఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడుకు మరో చేదు వార్త వినిపించే అవకాశం ఉంది. మూలిగే నక్క మీద తాటి కాయ అన్నట్లు ఇప్పటికే టెన్షన్ తో నిద్ర కూడా పట్టకుండా ఉంటున్న చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ అదికారులు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా రేవంత్ రెడ్డి వ్యవహారంలో నోటీసులు అందించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే జైలులో ఉంటున్న రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని కోరిన ఏసీబీ అధికారులు.. తాజాగా చంద్రబాబుకు కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో తమ బాస్ అన్నీ చూసుకుంటారని.. అన్న మాటల ఆధారంగా లేదా నాయిని నర్సింహారెడ్డి అన్నట్లు నిజమైన ఆడియో ఆధారాలు ఉన్నాయన్న నమ్మకంతోనో తెలియదు కానీ ఏసీబీ అధికారులు మాత్రం చంద్రబాబు నాయుడకు నోటీసులు జారీ చెయ్యాలని నిర్ణయించారు.

అయితే రేవంత్ రెడ్డి వ్యవహారంలో మరింత సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరించినట్లు సామాచారం. రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన యాభై లక్షల నగదు ఎన్డీఆర్ ట్రస్టు భవన్ కు దగ్గరలో ఉన్న ఓ బ్యాంక్ నుండి డ్రా చేసినట్లు సమాచారం. అయితే మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలకు తలా యాభై లక్షల చొప్పున రెండున్నర కోట్ల రూపాయలు సిద్దం చేసిన్టలు కూడా ఏసీబీ అధికారులు బావిస్తున్నారు. మరి అందరూ విమర్శిస్తున్నట్లు చంద్రబాబు నాయుడే సూత్రదారా.? లేదా కేవలం విమర్శలు మాత్రమేనా అన్న విషయాలు నిగ్గు తేలాల్సి ఉంది. మొత్తానికి అటు తిరిగి ిటు తిరిగి చివరకు చంద్రబాబు దాకా రానే వచ్చింది ఓటుకు నోటు వ్యవహారం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACB  telangana  Revanth Reddy  Chandrababunaidu  Notices  

Other Articles