bosta, bosta satyanarayana, congress, suspention, YSRCP

Congress party took excellent decision on bosta stayanaraya

bosta, bosta satyanarayana, congress, suspention, YSRCP

Congress party took excellent decision on bosta stayanaraya. Congress party suspend ex pcc president Bosta stayanaraya.

అబ్బో కాంగ్రెస్ పొడిచింది

Posted: 06/05/2015 11:45 AM IST
Congress party took excellent decision on bosta stayanaraya

ఏంటీ వెక్కిరిస్తున్నారు అని అనుకుంటున్నారా..? కానీ ఏం చేస్తాం దేశంలో పెద్ద పార్టీ .. ఎంతో చరిత్ర ఉన్న పార్టీ.. ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీ .. ఇలా కాంగ్రెస్ గురించి రాసుకుంటూ పోతే పుంఖాలుపుంకాలు రాసుకోవచ్చు. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు మాత్రం వింతగా ఉంటున్నాయి మరి. విభజన తర్వాత కనీసం పార్టీ జెండా మోసే కూలీలు కూడా కరువైన కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద తలకాయ గుడ్ బై చెబుతోంది. ఒకప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా, మంత్రిగా పనిచేసి బొత్స సత్యనారాయణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. అయితే ఏడో తేది బొత్స వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకుంది.

గత కొంత కాలంగా బొత్స సత్యనారాయణ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారు. అందుకే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం అంటూ కాంగ్రెస్ పార్టీ హుకుం జారీ చేసింది. అయినా ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అని అనకుండా.. పార్టీ నుండి జంప్ అవుతున్నారు కాబట్టి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని చెప్పొచ్చుగా. అయితే ఇక్కడ మరో విషయం ఉంది. మూడు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేసి.. లెటర్లను అధినేత్రి సోనియా గాంధీకి కూడా పంపారు. కానీ అవేవీ తెలియదు అన్నట్లు బొత్స సత్యనారాయణ సస్పెన్షన్ అంటూ ఆర్డర్ పాస్ చేసింది. మొత్తానికి ఏం చెయ్యాలో అర్థం కాని కాంగ్రెస్ చివరకు సస్పెన్షన్ పాస్ చేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bosta  bosta satyanarayana  congress  suspention  YSRCP  

Other Articles