Maggi, Ban, India, Nestle

Maggi noodles story got end card in all over india

Maggi, Ban, India, Nestle

maggi noodles story got end card in all over india. Most states ban the maggi for containing high percentage of mercury. High Mercury will cost the seriour health problems to children.

మ్యాగీ కథ ముగిసింది ఇలా..

Posted: 06/05/2015 11:20 AM IST
Maggi noodles story got end card in all over india

టేస్టీ, హెల్దీ అంటూ పిల్లలకే కాదు పెద్దవాళ్లకూ అడిక్షన్ లా మారిపోయింది. టూ మినిట్ నూడుల్స్ అంటూ మ్యాగీ కోట్లాది మందిని ఆకర్షించింది. అలాంటి మ్యాగీకి గడ్డుకాలం నడుస్తోంది. యూపీలో మొదలైన నిషేధం ఢిల్లీ, కేరళ, తమిళనాడుకు పాకి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. సుమారు 10కి పైగా రాష్ట్రాల్లో బ్యాన్ కంటిన్యూ అవుతోంది. బెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, హర్యానాల్లో శాంపిల్ టెస్టులు జరుగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ మ్యాగీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దేశవ్యాప్తంగా వెయ్యి క్యాంటీన్లలో ఆర్మీ మ్యాగీని ప్రొవైడ్ చేస్తోంది. బ్యాన్ కారణంగా వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక మ్యాగీ బిగ్గెస్ట్ రీటైలర్ ఫ్యూచర్ గ్రూప్ సప్లై నుంచి తప్పుకుంది. అంతేకాదు నెస్లే పాల పాకెట్లలో లార్వా బయటపడింది. దాంతో తమిళనాడులో వాటినీ నిషేధించారు. ఇలా అన్ని వైపుల నుంచి నెస్లే ను కష్టాలు చుట్టుముట్టాయి. మ్యాగీ లాంటి కేసుల్లో చట్టాలను కఠినం చేస్తామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు హానికర పదార్థాలను ప్రమోట్ చేసే వాళ్లపైనా కఠిన చర్యలు తప్పవని స్టేట్ మెంట్ ఇచ్చింది.

మ్యాగీ నూడుల్స్ లో లెడ్ ఎక్కువుందన్న విషయం దేశవ్యాప్తంగా పాకింది. మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో ఆ ఎఫెక్ట్ సేల్స్ పై పడింది. మెట్రో సిటీస్ లో 40 శాతం సేల్స్ పడిపోయాయి. నెస్లే ప్రోడక్ట్స్ లో 20 శాతం ఆదాయం ఒక్క మ్యాగీ నుంచే వస్తుంది. కానీ దాని సేల్స్ పడిపోవడంతో నెస్లే షేర్లూ 10 శాతం పడిపోయాయి. ఏటా మ్యాగీ నూడుల్స్ బిజినెస్ 15 వందల కోట్లకు పైనే. మ్యాగీని ప్రమోట్ చేసిన అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటాపై కేసులు నమోదయ్యాయి. 12 ఏళ్ల క్రితం చేసిన యాడ్ తో ఇపుడేంటి సంబంధమంటూ ప్రీతి జింటా ట్వీట్ చేసింది. ఇక అమితాబ్ కూడా మ్యాగీ యాడ్ పై వివరణ ఇచ్చారు. మొత్తానికి మ్యాగీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా మ్యాగీ పై బ్యాక్ వేసింది. తెలంగాణ వ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలు జరపకూడదు అని తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maggi  Ban  India  Nestle  

Other Articles