Telangana, Osmania university, Notifications, jobs

Telangana cm kcr facing new problem from students for job notifications

Telangana, Osmania university, Notifications, jobs

Telangana cm KCR facing new problem from students for job notifications. Osmania University students oppose the KCR govt and they demand for release the notifications.

వాళ్ల దెబ్బకు కేసీఆర్ అబ్బా అంటాడా..?

Posted: 06/02/2015 01:52 PM IST
Telangana cm kcr facing new problem from students for job notifications

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వన్ మెన్ ఆర్మీలా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు ఎదురు లేకుండా ఉంది. అయితే తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవరించిన విద్యార్థులే ఇప్పుడు కేసీఆర్ కు ముప్పుగా మారారా..? అంటే అవును అన్నట్లే ఉంది పరిస్థితి. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నియామకాలు అంటూ ఉద్యమాన్ని పీక్స్ కు తీసుకువెళ్లిన కేసీఆర్.. ఇప్పుడు విద్యార్థుల చేతిలో ఇబ్బందులు పడక తప్పని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెల్లబుచ్చుతున్న తెలంగాణ సర్కార్ పై విద్యార్థులు గుర్రుగా ఉన్నారు. కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అయినా నోటిఫికేషన్ల గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విద్యార్థులకు కోపం తెప్పిస్తోంది.

ఉద్యోగాలు వస్తాయని ఏ మాత్రం ఆలోచించకుండా తెలంగాణ ఉద్యమంలో సమిధలుగా మారిన విద్యార్తులు చాలా మందే ఉన్నారు. అలాగే చాలా మంది విద్యార్థులు ఉద్యమం కోసం త్యాగాలకు, తమ జీవితాలను సైతం పణంగా పెట్టారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నా.. కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ ను కూడా జారీ చెయ్యలేదు. ఉస్మానియా యూనివర్సిటీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని.. పేదలకు ఉచితంగా ఇళ్లను కట్టించి ఇస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పటికే ఉస్మానియా విద్యార్థుల్లో ఆగ్రహ జ్వాలలు రగిలించింది. అయితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కనీసం ఉద్యోగ ప్రకటన చెయ్యపోవడం వారికి తీవ్రంగా కోపం తెప్పిస్తోంది. దీంతో ఆగ్రహించిన ఓయూ విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం యూనివర్సిటీ నుంచి గన్‌పార్క్ వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ర్యాలీ ఎన్‌సీసీ గేటు వద్దకు చేరుకోగానే పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తర్వాత విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరి ఈ నిరసనలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Osmania university  Notifications  jobs  

Other Articles