Osmania university, KCR, telangana, Protest

Osmania students protest finally got telangana as new state in indian map

Osmania university, KCR, telangana, Protest

Osmania students protest finally got telangana as new state in indian map. The students of osmania, sacrifise everything for telangana protest.

ITEMVIDEOS: ఉ అంటే ఉద్యమం.. ఉ అంటే ఉస్మానియా

Posted: 06/02/2015 03:41 PM IST
Osmania students protest finally got telangana as new state in indian map

తెలంగాణ ఉద్యమంకు మరుభూమిగా నిలిచింది ఉస్మానియా యూనివర్సిటి. ఎంతో మంది విద్యార్థులు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ గొంతెత్తి.. తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికి తీసుకువెళ్లారు. తెలంగాణను కోరుతూ కేసీఆర్ చేసిన నిరాహార దీక్షకన్నా ఉస్మానియా విద్యార్థులు ఎంతో మంది చేసిన త్యాగాలను ఎవ్వరూ మరిచిపోలేరు. ఎన్నో సార్లు లాఠీల దెబ్బలతో ఒళ్లంతా హూనమైనా  ఏ మాత్రం భయపడని ఎంతో మంది విద్యార్థులు నేటి తెలంగాణ రాష్ట్రానికి తమ రక్తంతో దారులు వేశారు. చరిత్ర పుటలో తమ రక్తంతో తెలంగాణ రాష్ట్ర మొదటిపేజీని లిఖించారు.

నీళ్లు, నియామకాలు అన్న నినాదానికి.. విజయమో, వీర మరణమో అన్నట్లు తెలంగాణ ముద్దు బిడ్డలు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఇది మా బతుకుపోరాటం.. ముందు తరాల బంగారు భవితకోసం చేస్తున్న ఆరాటం అన్నట్లు విద్యార్తులు చేసిన ఉద్యమానికి యావత్ బారత్ ఊగిపోయింది. మా పాలన.. మా ప్రభుత్వం కావాలి అన్న విధానానినికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురు నిలిచారు విద్యార్తులు. ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఉద్యమ పాఠాలు నేర్చుకున్నారు.  ఉస్మానియా సాక్షిగా  ఎంతో మంది అసువులు బాసారు. అలాంటి వారందరినీ స్మరించుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ మొదటి ఏడాది శుభాకాంక్షలు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Osmania university  KCR  telangana  Protest  

Other Articles