President Pranab Mukherjee arrives in Sweden for five-day State visit

President pranab mukherjee leaves to sweden belarus for five day visit

president pranab mukherjee leaves to sweden belarus for five day visit, President Pranab Mukherjee arrives in Sweden for five-day State visit, Belarus, Pranab Mukherjee, State visit, Sweden, president pranab mukharjee

President Pranab Mukherjee on Sunday arrived on the first leg of his five-day state visit to Sweden and Belarus, the first ever by any Indian head of state, during which a number of key agreements on sustainable development, scientific research are likely to be signed.

ఇక ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంతు వచ్చింది.

Posted: 05/31/2015 09:54 PM IST
President pranab mukherjee leaves to sweden belarus for five day visit

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం స్వీడన్, బెలారస్ దేశాలలో పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేంద్రంలో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన తరచూ విదేశీయానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లకు రాష్టపతి ప్రణబ్ వంతు వచ్చింది. ఆయన స్వీడన్ చేరుకున్నారు. జూన్ 2 వ తేదీ వరకు ఆయన స్వీడన్లో పర్యటిస్తారు. అందులో భాగంగా స్వీడన్ రాజు, రాణీతో ప్రణబ్ ముఖర్జీ భేటీ కానున్నారు. అలాగే స్వీడన్ ప్రధాని పార్లమెంట్ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడిని కూడా ప్రణబ్ కలవనున్నారు. స్వీడన్లోని స్మార్ట్ సిటీలతోపాటు యూరోప్లో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒక్కటైన ఉప్పశాలను ప్రణబ్ ముఖర్జీ సందర్శించనున్నారు.  ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా విద్యా, వ్యాపారం, అరోగ్యం తదితర అంశాలపై ఒప్పందాలు చేసుకోనున్నారు.

అనంతరం ప్రణబ్ ముఖర్జీ బెలారస్ చేరుకుంటారు. ఆ దేశాధ్యక్షుడితో సమావేశం కానున్నారు. ప్రణబ్,ఆ దేశాధ్యక్షుడితో కలిసి సంయుక్త వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. జూన్ 4వ తేదీన ప్రణబ్ భారత్కు తిరిగి వస్తారు. ప్రణబ్ వెంట వెళ్లిన బృందంలో కేంద్ర ఎరువులు మరియు రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారామ్ అహీర్, పార్లమెంట్ సభ్యులు గులాం నబి ఆజాద్, అశ్వీని కుమార్, దేశంలోని ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన ఏడుగురు వైస్ చాన్సలర్లతోపాటు 60 మంది భారతీయ వ్యాపారవేత్తలు ఉన్నారు.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranab Mukherjee  Sweden  Belarus  

Other Articles