TRS | KCR | Hyderabad

Trs party leader mainly kcr targetting hyderabad on ghmc elections

TRS, KCR, Hyderabad, Telangana, GHMC, Elections

TRS party leader mainly kcr targetting hyderabad on ghmc elections. Telangana cm kcr chanting hyderabad name. On GHMC elections kcr concentrating on hyderabad and he proposing new schemes and programmees.

కేసీఆర్ నోట.. హైదరాబాద్ మాట ఇంతలా ఎందుకంటే.. ?

Posted: 05/11/2015 01:38 PM IST
Trs party leader mainly kcr targetting hyderabad on ghmc elections

హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తాం అంటూ తెలంగాణ ప్రభుత్వం తెగ ఊదరగొడుతోంది. ఇక కేసీఆర్ మాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే హైదరాబాద్ పై ప్రేమ మరీ ఎక్కువైంది ఎందుకా అంటే దానికో పక్క రీజన్ కూడా ఉందిలెండి. ఏంటా రీసన్ అనుకుంటున్నారా.. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలే. అవునుగ్రేటర్ ఓటర్లకు భారీ గాలం వేసింది టిఆర్ఎస్. స్వచ్చ భారత్ ను పార్టీ తన సొంతం చేసుకుంటోంది. ఇన్నాళ్ళూ అభివృద్ధి మంత్రం జపించిన టిఆర్ఎస్, బల్దియా ఎన్నికల కోసం పనికి వచ్చే దేన్నైనా వాడుకుంటోంది. స్కైవేలు, ఎక్సెప్రెస్ రోడ్లు నిర్మిస్తామని ఇన్నాళ్లు చెప్పిన కేసీఆర్, ఇపుడు స్వచ్చ్ హైదరాబాద్ వైపు అడుగులు వేస్తున్నారు.

గ్రేటర్ కోట మీద గులాబీ జెండా ఎగరేసిందుకు టీఆర్ఎస్ అవకాశమున్న అన్నిప్రయత్నాలు చేస్తోందట. మొన్నటి వరకు పార్టీ సభ్యత్వాలపై దృష్టి సారించింది. మరోవైపు పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇక హైదరాబాద్ని 10వేల కోట్లతో విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రతిన పూనారు కెసిఆర్. ఇక తాజాగా స్వచ్ భారత్ని స్వచ్ హైదరాబాద్ పేరుతో గ్రేటర్లో పాగా వేసేందుకు గ్రేట్ ప్లాన్ గా వాడుకుకోవాలనుకుంటోంది టిఆర్ఎస్. గ్రేటర్ లో కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. ఎంఐఎంతో పొత్తు అంశం, బీజేపీ నుంచి గట్టిపోటి ఎదురయ్యే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ తనకు తాను నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ఐటీ, ఫార్మా రంగాలకు హైదరాబాద్ కేరాఫ్ గా ఉంటుందని చెబుతున్న కేసీఆర్, తాజా స్వచ్చ్ హైదరబాద్ పల్లవి అందుకున్నారు. హైదరబాద్ ను నాలుగు వందల భాగాలుగా విభజించి స్వచ్చ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్నటికే నగరాభివృద్ద్దిపై వ్యూహరచన చేస్తున్నారు కెసిఆర్. స్కైవేలు, స్పెషల్ రోడ్లను అమెరికాలోని డల్లాస్ సిటీ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. హుసేన్ సాగర్ శుద్ధి, కళా భారతి నిర్మాణం, మెట్రో రైల్ విస్తరణ ఇలా చాలా హామీలు గుప్పిస్తున్నారు. మరో ఆరు నెలల్లో హైదరాబాద్ వేదికగా కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అధికార పార్టీ తీసుకున్న కార్యక్రమం గ్రేటర్ లో చర్చనీయాంశమైంది. ఆరు నూరైనా గ్రేటర్పై గులాబీ జెండానెగురవేయాలన్న లక్ష్యంతో ఉన్నారు కెసిఆర్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  KCR  Hyderabad  Telangana  GHMC  Elections  

Other Articles