Hyderabad High Court Release Notice To Reliance Industries and Mukesh ambani in Land scam case

Hyderabad high court release notice reliance industries mukesh ambani land scam

mukesh ambani, mukesh ambani news, hyderabad high court, mukesh ambani court notice, narayana rao, durgamba lady, mukesh ambani durgamba, mukesh ambani land scam case, durgamba land scam case, kakinada police station, telugu high court

Hyderabad High Court Release Notice Reliance Industries Mukesh ambani Land scam : A woman named durgamba filed petition high court on mukesh ambani, reliance industries and narayana rao in land scam. So that court releases notice to all of them include with kakinada police station.

‘రిలయన్స్’ ముఖేష్ అంబానీకి ‘తెలుగు’ హైకోర్టు నోటీసులు?

Posted: 04/28/2015 11:19 AM IST
Hyderabad high court release notice reliance industries mukesh ambani land scam

‘ఏ నిముషానికి.. ఏమీ జరుగునో..’ అన్న మాటలు ప్రస్తుతం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి బాగానే వర్తిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా వున్న ఆస్తిపరుల్లో తన పేరును లిఖించుకున్న ఈ దిగ్గజ వ్యాపారవేత్త.. అదేవిధంగా నిత్యం ఏదో ఓ వివాదంలో ఇరుక్కుంటూనే వుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఈయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం! అది కూడా ‘తెలుగు’ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి ఆయనకు నోటీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన భూసమీకరణకు సంబంధించి ముఖేష్ అంబానీ, ఆయన సంస్థతోపాటు ఓ స్థానికుడు తనను మోసం చేశారని దుర్గాంబ అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకే హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. కాకినాడకు చెందిన నారాయణరావు అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి.. తన స్థలాన్ని రిలయన్స్ కు విక్రయించాడని.. ఆ పత్రాలను సరిచూసుకోకుండానే రిలయన్స్ కూడా తన స్థలాన్ని స్వాధీనం చేసుకుందని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది. ఈ మేరకు ఆమె మొదట కిందకోర్టుకు ఫిర్యాదు చేయగా.. ఈ వ్యవహారంలో రిలయన్స్, ముఖేష్ అంబానీకి ఎలాంటి పాత్రలేదని తీర్పునిచ్చింది. అయితే.. అందుకు సవాలుగా ఆమె క్రిందికోర్టు తీర్పును రద్దు చేసి, ముఖేష్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టును అభ్యర్థించింది.

దుర్గాంబ వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రిలయన్స్, ముఖేష్, నారాయణరావుతోపాటు కాకినాడ వన్ టౌన్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను జూన్ 3కు కోర్టు వాయిదా వేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mukesh ambani  Hyderabad high court  kakinada land scam case  

Other Articles