Elections | Japan | Sunday | Campaigning

Right wing candidate s nude campaign poster skirts election law

elections, japan, sunday, Campaigning, votes, theruki goto, posters

Campaigning for Sunday’s second wave of quadrennial unified local elections has highlighted a legal loophole that allows candidates to go to extremes — including nudity — to gain votes.

వాయమ్మనే.. ఓట్ల కోసం.. బట్టలు లేకుండా ఫోటోలు దిగుతారా..?

Posted: 04/25/2015 04:40 PM IST
Right wing candidate s nude campaign poster skirts election law

సినిమా వాళ్ల కంటే భలే బాగా నటించేస్తారు రాజకీయ నాయకులు. ఇది అందరికి తెలుసు.. ఎన్నికలు రాగానే ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయనాయకులు చేయని ఫీట్లుండరు. ఓ నాయకుడు ఛాయ్ పోస్తాడు.. ఇంకో నాయకుడు చింటూ గాడి ముడ్డి కడుగుతాడు.. మరో నాయకుడు అంట్లు కూడా తోముతారు. భారత్ లొ మాత్రమే ఇలాంటివి జరుగుతాయి అని అనుకుంటే పొరపాటే.. ప్రపంచంలో ఎన్నికలు జరిగే అన్ని చోట్ల జరిగే సీన్లు ఇవి. అయితే సినిమాలో కాస్త హాట్ అందాలను చూపిస్తే ఎలా పాపులారిటీ వస్తుందో అలా ఎన్నికల్లో పాపులారిటీ కోసం బట్టులు విడిచి.. పోస్టర్ కు ఫోజ్ ఇచ్చాడు ఓ మహానుభావుడు. జపాన్ లో జరుగుతున్న ఎన్నికల్లో జరిగిన ఈ ఘటన గురించి మీరూ తెలుసుకొండి..

జపాన్లో ఆదివారం జరుగనున్న స్థానికసంస్థల ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి సంప్రదాయవాద వర్గానికి చెందిన తెరుకీ గోటో ఏకంగా బట్టలు విప్పేసుకున్నాడు. నగ్నంగా యుద్ధవీరుడిలా పోస్టర్ పై దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.టోక్యోలోని ఛియోడా వార్డుకు జరిగే ఎన్నికలో పోటీ చేస్తున్న తెరుకీ ప్రస్తుతం ప్రచారంలో హాట్ హాట్ గా మారాడు. తాజా పోస్టర్ ప్రచారంతో ఓటర్ల దృష్టిని ఆకర్షించడంలో సఫలమయ్యాడేమో కానీ ఆయన వ్యవహారంపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇలాంటి సంప్రదాయాలకు చోటివ్వకూడదని ఇతరపార్టీల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో నగ్న ఫొటోలను వాడుకోవడంపై నిషేధం విధించలేదని, తప్పుడు సమాచారంతో ఓటర్లను మభ్యపెట్టే విధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఏది ఏమైతేనేం మనోడు ఏకంగా ఇంటర్నేషనల్ మీడియాకెక్కాడు. మనోడి పోస్టర్ కు పడిపోయి ఓట్లు పడతాయో లేదో ఆదివారం వరకు చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : elections  japan  sunday  Campaigning  votes  theruki goto  posters  

Other Articles