Farmer’s family rejects Kejriwal’s apology, says it won't bring back Gajendra

Gajendra s family rejects arvind kejriwal s apology

Gajendra's family rejects Arvind Kejriwal's apology, Farmer’s family rejects Kejriwal’s apology, Farmer’s family says it won't bring back Gajendra, aap, kejriwal, farmer, suicide, apology, delhi, jantarmantar, Delhi cm arvind kejriwal apologise to farmers family on famer suicide at aap rally, gajendra singh, farmer, suicide, family, aap, arvind kejriwal, apology, rajasthan, new delhi

The family of Gajendra Singh, who hanged himself at New Delhi's Jantar Mantar as the Aam Aadmi Party held a rally there on Wednesday, on Friday rejected Chief Minister Arvind Kejriwal's apology, calling it "too little, too late".

కేజ్రీ క్షమాపణల తిరస్కరణ, ‘మా అబ్బాయిని తీసుకురాగలదా..?’

Posted: 04/24/2015 02:56 PM IST
Gajendra s family rejects arvind kejriwal s apology

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత, అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలను ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింగ్ కుటుంబం తిరస్కరించింది. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని, క్షమాపణ చెబితే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు తన కొడుకును బతికించి తీసుకురాగలదా అని ఆయన నిలదీశారు. ర్యాలీలో తన కొడుకును కాపాడటం కేజ్రీవాల్ ఒక్కడి వల్లే  సాధ్యం కాకపోతే...కనీసం కార్యకర్తలను, పోలీసులను ఆదేశించి ఉండాల్సిందని గజేంద్ర సింగ్ తండ్రి బనే సింగ్ విమర్శించారు. చనిపోతున్న మనిషిని రక్షించలేకపోవడం ఢిల్లీ ముఖ్యమంత్రికి అవమానమన్నారు.

దౌసా జిల్లాలోని నంగల్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేజ్రీవాల్  సహచరులతో కలిసి వైదికపై నుంచి చోద్యం చూశారు తప్ప తన కొడుకును రక్షించే ప్రయత్నం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే తన సొంత పిల్లలు ఆ పరిస్థితిలో ఉండి ఉంటే కేజ్రీవాల్ ఇలాగే చేశావారా  అని ఆయన నిలదీశారు. కాగా, ఆప్ ర్యాలీలో గజేంద్ర సింగ్ ఆత్మహత్య సందర్శంగా వెల్లువెత్తిన విమర్శలతో ఇరకాటంలో పడిన కేజ్రీవాల్  తప్పు దిద్దుకునే పనిలో భాగంగా ఘటన జరిగిన రెండు రోజులు తర్వాత తప్పుచేశాను క్షమించమని కోరిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal  gajender family  apology gajendra'sFather  Bane singh  

Other Articles